11-02-2025 12:37:50 AM
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 10 (విజయ క్రాంతి): గ్రామంలో ఉన్న సంపదను ప్రభు త్వ నిబంధనల ప్రకారం తీసుకెళ్లి.. ప్రభుత్వం నుంచి గ్రామానికి అందవలసిన రాయల్టీ డబ్బుల లెక్క తేరాల్సిన అవసరం ఉందని మూసపేట్ మండల్ పోల్కంపల్లి గ్రామ వాసులు పంచాయతీ కార్యదర్శి కి ఫిర్యాదు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోల్కంపల్లి గ్రామపంచాయతీలో పుష్కలంగా ఇసుక వాగు, స్టోన్స్ లభించే ప్రాంతంగా బాగా గుర్తింపు పొందింది.
ఈ క్రమంలోనే దశబ్దల తరబడి ఈ ప్రాంతంలో ప్రభుత్వం పాలమూరు సాండ్ పేరుతో ఇసు కను కూడా పట్టణ ప్రాంతాలకు సరఫరా చేసింది. దీనికి తోడు కంకర మిషన్ ఏర్పా టుకు 2017-18 సంవత్సరంలో ఓ వ్యక్తికి 10 సంవత్సరాల పాటు అనుమతి ఇవ్వడం జరిగింది.
అరుదైన వనరులు ఉన్న ఈ గ్రామానికి సంబంధించి అంతే మొత్తంలో రాయల్టీ నిధులు కూడా రావాల్సి ఉందని ఆ నిధులతో గ్రామంలోని అవసరమైన సదు పాయాలు అద్భుతంగా ఏర్పాటు చేసేందు కు అవకాశం ఉంటుందని పలువురు గ్రామ స్తులు రాయాల్టీ నిధులు లెక్క తేలాలని పంచాయతీ సెక్రెటరీ వినతి పత్రం సమర్పిం చారు. ప్రభుత్వానికి చెల్లించిన డబ్బులకు తిరిగి రాయాలిటీ పరంగా గ్రామ పంచాయ తీ ఖాతాలో జమ చేయాలని ఆ నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేయాలని వారు కోరుతున్నారు.
గ్రామస్థులకు ఎన్నో సందేహాలు..
గ్రామంలో క్రషర్ మిషన్ ఏర్పాటు చేసేం దుకు 2017 సంవత్సరంలో ప్రభుత్వము అనుమతులు మంజూరు చేసింది. అప్పటి నుంచి 2024 చివరి వరకు ప్రభుత్వానికి కంకర మిషన్ నిర్వాహకులు రూ కోటి 7 లక్షల 5 వేలను ప్రభుత్వానికి చెల్లించారు. ఈ మొత్తంలో గ్రామానికి రావలసిన దాదాపు 30 లక్షలు వచ్చాయా ? లేదా ? వివరాలు తెలపాలని గ్రామస్తులు కోరుతుండ్రు.
దీంతోపాటు గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం సంబంధించి గ్రామపంచా యతీ ట్రాక్టర్ ద్వారా గతంలో రూ 1000 చొప్పున దాదాపు 40 ఏళ్లకు ఇసుకను తరలించడం జరిగిందని ఈ నిధులు కూడా ఈ నిధులు లెక్క కూడా తేలలని, పాలమూ రు సాటి విషయంలో ప్రభుత్వ నిబంధనల మేరకు ఇసుక తరలింపు జరిగిందని ఆ క్రమంలో రాయల్టీగా ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు ఎంత మీదకు వచ్చా యని సందేహాలు గ్రామస్తులు వ్యక్తం చేస్తు న్నారు.
గ్రామ సంపద బయటికి పంపించి గ్రామ అభివృద్ధికి ఆ నిధులు సహకరించ కపోతే గ్రామ పరిధిలో ఉన్న సంపద దూర మైతే గ్రామం తీవ్రంగా నష్టపోయే అవకాశా లు ఉంటాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఈ విషయంపై గతంలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శి వివరణ కోరగా కంక ర మిషన్ నిర్వాహకులు ప్రభుత్వానికి చెల్లిం చిన డబ్బులలో రాయల్టి నిధులు గ్రామ పంచాయతీకి రాలేదని, గ్రామంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఇసుక తరలింపు డబ్బు లతో పాటు పాలమూరు స్టాండ్ నిధులు గ్రామపంచాయతీ ఖాతాలో జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు.
ఆ నిధులను గ్రామ అభివృద్ధికి ఖర్చు చేయడం జరిగిందని తెలియజేశారు. గ్రామస్తులు మాత్రం పూర్తి స్థాయిలో విచారణ చేయాలని గ్రామం పరి ధిలో జరగాల్సిన అభివృద్ధి జరగకుండానే నిధులు అవకతవకలు జరిగాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధి కారులు స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటే నిజ నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.