calender_icon.png 30 October, 2024 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ నిధులు గోల్‌మాల్

14-09-2024 12:00:00 AM

గ్రామస్థుల ఫిర్యాదుతో డీఎల్‌పీవో విచారణ

జనగామ, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): జనగామ మండలంలోని పసరమడ్ల గ్రామ ంలో తాజా మాజీ సర్పంచ్, మాజీ పంచాయతీ కార్యదర్శి కలిసి లక్షల నిధులు దారి మళ్లించారని గ్రామస్థులు ఫిర్యాదు చేయడం తో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. తాజా మాజీ సర్పంచ్ శివరాత్రి స్వప్న, ప్రస్తు తం చీటకోడూరు పంచాయతీ కార్యదర్శిగా ఉన్న వాసంతి కలిసి ఐదేళ్లలో అనేక అక్రమా లకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. సర్ప ంచ్ బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి కావడం తో ఇన్ని రోజులు ఎవరూ పట్టించుకోలేదని గ్రామస్థులు చెప్పారు.

మూడు నెలల క్రితం వరకు ఇక్కడ విధులు నిర్వహించిన పంచా యతీ కార్యదర్శి వాసంతి సహకారంతో సర్ప ంచ్ స్వప్న అనేక అక్రమాలకు పాల్పడ్డారని గ్రామస్థులు పంచాయతీ అధికారులతోపా టు అడిషనల్ కలెక్టర్, కలెక్టర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఫలితం లేకపోవడంతో ఇ టీవల మంత్రి సీతక్కను కలిసి ఫిర్యాదు చేశా రు. చేయని పనులను చేసినట్లు చూపించి ల క్షల్లో నిధులు గోల్‌మాల్ చేశారని ఫిర్యాదు లో పేర్కొన్నారు.  వార్డు మెంబర్ల సంతకాలు ఫోర్జరీ చేశారని, చేసిన పనులకు, రికార్డులకు పొంతన లేదని వివరించారు.

జీపీకి సంబంధించిన నిధులు రూ.2.38 లక్షలు కార్యదర్శి వాసంతి బంధు వు అకౌంట్‌లో జమ అయినట్టు తాము గు ర్తించామని తెలిపారు. గ్రామస్థుల ఫిర్యాదుపై మంత్రి సీతక్క స్పందించి విచారణకు ఆదేశించారు. శుక్రవారం పసరమ డ్లకి డీఎల్ పీవో మహేందర్‌రెడ్డి వచ్చారు. గ్రా మ పంచాయతీ రికార్డులను పరిశీలించారు. ఫి ర్యాదుదారులు, ఆరోపణలు ఎదుర్కొంటు న్న తాజా మాజీ సర్పంచ్ స్వప్న నుంచి స్టేట్‌మె ం ట్ తీసుకున్నట్టు తెలిపారు. విచారణ జరిపి నివేదికను కలెక్టర్‌కు నివేదిస్తామని డీఎల్‌పీవో చెప్పారు.