- అభ్యర్థుల గుర్తుల కేటాయింపు
జిల్లాలో పంచాయతీ ఓటర్లు 5,19,009
మెదక్, జనవరి 12 (విజయక్రాంతి) : పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కాకముందే మెదక్ జిల్లాలో అధికారులు ఏర్పాట్లను మాత్రం ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితా, బ్యాలెట్ బాక్సు లు, పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఎన్నికల విధుల ప్రవర్తనా నియమావళి, శిక్షణకు సంబంధించిన పుస్తకాలు జిల్లా పంచాయతీ కార్యాలయానికి ఉన్నతాధికా రులు పంపించారు.
గతేడాది డిసెంబరులో గుర్తించిన పోలింగ్ కేంద్రాలకు కలెక్టర్ ఆమోద ముద్ర వేశారు. అవసరమైన బ్యాలెట్ బాక్సులను సిద్ధంగా ఉంచారు. ఎన్నికల్లో కీలకమైన 11 అంశాలకు సంబంధించి జిల్లా స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు. తాజాగా ఎన్నికల్లో పోటీ చేసే సర్పం, వార్డు సభ్యుల అభ్యర్థులకు రాష్ర్ట ఎన్నికల కమిషన్ గుర్తులను కేటాయించింది.
వీటికి సంబంధించిన సర్క్యులర్ జిల్లా పంచా యతీ అధికారులు చేరింది. ఆ మేరకు నిర్ణీత ఎన్నికల గుర్తులను ముద్రించేందుకు ప్రింటింగ్ ప్రెస్కు పంపించినట్లు అధికా రులు చెబుతున్నారు. సర్పంచి అభ్యర్థులకు 30, వార్డు సభ్యులకు 20 రకాల గుర్తులను బ్యాలెట్ పత్రాల్లో ముద్రించబోతున్నారు.
రాజకీయ పార్టీల రహితంగా జరిగే ఎన్నికలు కావడం తో గ్రామీణ ఓటర్ల కు అవగా హన ఉన్న గుర్తులనే ము ద్రించనున్నారు. సర్పం చి అభ్యర్థులకు బ్యాలెట్ గులాబీ రంగు, వార్డు సభ్యుల బ్యాలెట్ తెలుపు రంగు కాగితాలపై ముద్రించనున్నారు.
సర్పంచ్ వార్డు అభ్యర్థులకు గుర్తులు..
సర్పంచి అభ్యర్థులకు ఉంగరం, కత్తెర, ఫుట్బాల్, బ్యాట్, లేడీ పర్సు, టీవీ రిమోట్, టూత్ పేస్ట్, చెత్తడబ్బా, నల్లబోర్డు, బెండకాయ, కొబ్బరితోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాం డిల్, టీ జల్లెడ, చేతికర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, బ్యాట్స్మన్, మని షి తెరచాప పడవ, బిస్కట్, వేణువు, చెయి న్, చెప్పులు, గాలి బుడ గ, స్టంప్స్ గుర్తులను కేటా యించారు.
వార్డులకు కూడా గుర్తులను కేటాయించడం జరిగింది. అందులో గ్యాస్ పొయ్యి, స్టూల్, గౌను, సిలిండర్, బీరువా, ఈల, కుండ డిష్ యాంటినా, గరాట, మూకుడు, ఐస్క్రీం, గాజు గ్లాసు, పోస్టు డబ్బా, కవరు, హాకీ బంతి, నెక్ టై, కటింగ్ ప్లేయర్, పెట్టె, స్తంభం, కేటిల్, బ్యాలెట్ గుర్తులను కేటా యించనున్నట్లు అధికారులు తెలిపారు.
నోటా తప్పనిసరి...
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులు, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు నచ్చకపోతే ఓటును నోటాకు వేయవచ్చు. ఈ అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పిం చింది. శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల గుర్తుల చివరన నోటా గుర్తును కేటాయించిన మాదిరిగానే బ్యాలె ట్ పత్రాల్లో సర్పంచులు, వార్డు సభ్యులకు కేటాయించిన గుర్తుల చివరన నోటా గుర్తును ఏర్పాటు చేయనున్నారు.
జిల్లాలో ఇలా..
- మొత్తం మండలాలు 21
- పంచాయతీల సంఖ్య 493
- వార్డులు 4,232
- మొత్తం ఓటర్లు 5,19,009
- పోలింగ్ కేంద్రాలు 4,232
- బ్యాలెట్ బాక్సులు 2,846
ఎన్నికలకు సిద్ధం చేస్తున్నాం..
పంచాయతీ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సమాయత్తం అవుతుం ది. మూడు విడతలుగా నిర్వహించే ఈ ఎన్నికల సందర్భంగా 12 మంది నోడ ల్ అధికారులను కలెక్టర్ నియమిం చారు. కమిషనర్ కార్యాలయం నుండి ఇప్పటికే మెటీరియల్ అందింది. బ్యా లెట్ పత్రాల ప్రింటింగుకు పంపిం చాము. బాక్సులు కూడా సిద్ధం చేశాం. ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం.
యాదయ్య, జిల్లా పంచాయతీ అధికారి, మెదక్