calender_icon.png 11 January, 2025 | 2:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతినెలా జీతాలపై పంచాయతీ ఉద్యోగుల హర్షం

11-01-2025 12:00:00 AM

హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీల ఉద్యోగులకు ప్రతినెలా జీతాలు ఇవ్వాలన్న ప్రభుత్వం నిర్ణయంపై గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మామిడాల నర్సింలు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన సచివాలయం వద్ద మీడియాతో మాట్లా డారు. గ్రామ పంచా యతీ ఉద్యోగులు వేతనాలు రాక అనేక ఇబ్బందులు పడ్డారని, తమ కష్టాలు చూసి చలించిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రతినెలా మొదటివారంలో వేతనాలు వచ్చేలా ఆదేశాలి వ్వడం సంతోషాన్నిచ్చిందన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు పంచాయతీ ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలిపా రు. గత సర్కార్ తమకు సకాలంలో  జీతాలు చెల్లించినట్లు ఆరోపించారు. తమకు సహకరిస్తున్న ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలా పని చేస్తామన్నారు.