- కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలి
- కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా.. అని హద్దు మీరొద్దు
- పార్టీ నష్టపోయే పరిస్థితులు తీసుకురావొద్దు: మంత్రి పొంగులేటి
వైరా, ఫిబ్రవరి 2: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 15లోపే రానున్నదని, కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికలకు సిద్ధం కావాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా వైరా మండ లం విప్పలమడకలో ఆదివారం పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది కాదా అని హద్దు మీరొద్దని హెచ్చరించారు. ఇష్టానుసారం వ్యవహరిస్తే పార్టీ నష్టపోతుందని అభిప్రాయపడ్డారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో జాగ్రత్తగా వహించాలని, అర్హులందరికీ ఇండ్లు అందేలా చూడాలన్నారు.
మంత్రి అనంతరం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్‌కు కాల్‌చేసి రైతుల వద్ద మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ తది తరులు పాల్గొన్నారు.