25-03-2025 12:22:54 AM
మఠంపల్లి, మార్చి 24: మఠంపల్లి మండల కేంద్రంలోని బొడ్రాయి సెంటర్ వద్ద ఉగాది పర్వదినం పురస్కరించుకొని స్థానిక ఆగ్నేష్ అమ్మ, బాలశౌరయ్య నాట్య కళామండలి జ్యోతి ప్రకాష్ యోజన నాట్య కళామండలి సంయుక్తంగా ఈ నెల 28న రాత్రి 8 గంటలకు అలనాటి చారిత్రక జానపద పద్య నాటకం బాలనాగమ్మ నాటకం కరపత్రాలను నియోజకవర్గ కళాకారుల సంఘం అధ్యక్షులు భువనగిరి ప్రకాష్ బాబు ఆధ్వర్యంలో సోమవారం ఆవిష్కరించారు.
ఈ సం దర్భంగా ప్రకాష్‌బాబు మాట్లాడుతూ మఠంపల్లి బొడ్రాయి సెంటర్లో సుమారు 50 సంవత్సరాల తర్వాత ఆంధ్ర, తెలంగాణ సీనియర్ కళాకారుల మేల వెంపుతో ఈ నాటకం ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు కళాకారులు కళాభిమానులు తరలివచ్చి నాటకాన్ని జయప్రదం చేయాలని కోరారు.
కార్యక్రమంలో సీనియర్ రంగస్థలం కళాకారులు థామస్ రెడ్డి, బివి రామా రావు, జూలు వెంకటేశ్వర్లు, జాల కిరణ్, మల్లెబోయిన గోపయ్య, షేక్ ఖాసిం, భువనగిరి జోసు, ధర్మయ్య గౌడ్, జయభారత్ రెడ్డి, ఎస్ కే సైదులు, నాగ బ్రహ్మచారి, వంగవీటి నాగేశ్వరరావు, నాగరాజు, బాణోతూ బాబు తదితరులు పాల్గొన్నారు.