calender_icon.png 9 April, 2025 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాంబన్ జాతీయం

07-04-2025 01:28:03 AM

  1. ఇంజినీరింగ్ అద్భుతమంటూ ప్రధాని మోదీ కితాబు 
  2. రూ. 550 కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణం
  3. దేశంలో  తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన 
  4. కార్యక్రమానికి గైర్హాజరయిన సీఎం స్టాలిన్

రామేశ్వరం, ఏప్రిల్ 6: రామేశ్వరానికి మరిన్ని వసతులు కల్పించే పాంబన్ వంతెనను ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఈ వంతెన దేశం లో తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతె న కావడం విశేషం. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు రూ. 550 కోట్ల ఖర్చు అయింది. ఈ వంతెన రామేశ్వరాన్ని భారత ప్రధా న భూభాగంతో కలపనుంది.

రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌వీఎన్‌ఎల్) నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది. సము ద్రంలో ఏర్పాటు చేసిన ఈ వంతెన మీద నుంచి రైళ్లు వెళ్లేలా ఏర్పాటు చేశారు. ఇక సముద్రంలో నడిచే భారీ ఓడలకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా లిఫ్ట్ సిస్టం ఏర్పాటు చేశారు. ఇటువంటి సాంకేతికతో మన దేశంలో నిర్మించిన తొలి వంతెన ఇదే.

ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ హాజరయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాత్రం హాజరుకాలేదు. శ్రీలంక పర్యటన ముగించుకుని వచ్చిన మోదీ ఆదివారం పాంబన్ బ్రిడ్జిని జాతికి అంకితం చేశారు. రామనవమి సందర్భంగా అయోధ్యలో సూర్యతిలకం ప్రదర్శితమవుతున్న వేళ.. రామసేతును దర్శించడం దైవ నిర్ణయంగా ఆయన అభివర్ణించారు.

రామేశ్వరం మధ్య ఓ ప్రత్యేక రైలును కూడా ప్రధాని ప్రారంభించారు. వంతెన కింద నుంచి ప్రయా ణించిన కోస్ట్ గార్డ్ నౌకకు కూడా మోదీ పచ్చజెండా ఊపారు. తమిళనాడులో రూ. 8,300 కోట్ల విలువైన నేషనల్ పాజె క్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. రామేశ్వర ఆలయాన్ని సందర్శించి జ్యోతిర్లిం గాల వద్ద పూజలు కూడా నిర్వహించారు.

 రామేశ్వరంలో పాంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవం తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. 

ఈ సందర్భంగా తమిళనాడును పాలిస్తున్న డీఎంకేపై విమర్శలు గుప్పించారు. కొందరు నేతలు సంతకాలను కూడా తమిళంలో చేయడం లేదు. కనీసం సంతకాలైనా తమిళంలో చేయాలని మోదీ నేతలకు విజ్ఞప్తి చేశారు. 

ఈ మూడు వంతెనలు అద్భుతం

ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో అద్భుతమైన మూడు వంతెనలను నిర్మించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘ముంబైలో సముద్ర వంతెన, ఇక్కడ రైల్వే వర్టికల్ వంతెన, ప్రపంచంలోనే ఎత్తయిన వంతెనను చినాబ్ నదిపై నిర్మించాం’ అని తెలిపారు. 

ఇంజినీర్‌గా తెలుగు కుర్రాడు

పాంబన్ బ్రిడ్జి నిర్మాణంలో ఇంచార్జిగా విజయనగరం జిల్లాకు చెందిన తెలుగు కుర్రాడు పాల్గొన్నారు. 28 ఏండ్ల వెంకట చక్రధర్ ఈ మహత్తర నిర్మాణంలో పాలు పంచుకున్నారు. సీనియర్ సెక్షన్ ఇంజినీర్ హోదాలో పాల్గొన్న చక్రధర్ వంతెన పూర్తి చేయడం కోసం రేయింబవళ్లూ కృషి చేసినట్లు పేర్కొన్నారు. ఈ వంతెన సాంకేతికను స్పెయిన్ నుంచి తీసుకున్నా.. సామగ్రి మొత్తం మన దేశంలో తయారయినదే కావడం విశేషం. 

మోదీ వ్యాఖ్యలను ఖండించిన చిదంబరం

ప్రధాని మోదీ ఆదివారం నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. ‘2004-14 మధ్య కంటే 2014-24 మధ్య తమిళనాడు అధికంగా నిధులు కేటాయించాం. రైల్వే ప్రాజెక్టులకు ఏడు రెట్లు నిధులు ఎక్కువ ఇచ్చాం’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై యూపీఏ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన చిదంబరం స్పందించారు.

మోదీ వ్యాఖ్యలను ఖండిస్తూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ‘ప్రధాని చెప్పింది తప్పుడు సమాచారం అని ఫస్ట్ ఇయర్ ఎకానమీ విద్యార్థి కూడా చెబుతాడు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు జీడీపీ పెరిగింది, బడ్జెట్ పెరిగింది. మీరు కేటాయించిన మొత్తం అంకెల పరంగా ఎక్కువగానే కనిపించినా జీడీపీ పరంగా లేదా మొత్తం వ్యయ నిష్పత్తితో పోల్చినపుడు అది ఎక్కువగా ఉందా?’ అని ప్రశ్నించారు.