19-03-2025 06:08:49 PM
రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల...
పాల్వంచ (విజయక్రాంతి): పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ వివిధ గోడౌన్ ల నిర్మాణానికి స్థలం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ V పాటిల్ ను కోరారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పాల్వంచ సొసైటీ పాలకవర్గం సభ్యులు కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ తో కొత్వాల మాట్లాడుతూ... పాల్వంచ సొసైటీ ద్వారా రైతులకు రుణాలు ఇవ్వడమే కాకుండా సబ్సిడీపై విత్తనాలు, MRP ధరలకు విత్తనాలు పంపిణి చేస్తున్నామన్నారు. 6 ధ్యాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు.
వీటికి సరైన గోడౌన్ సదుపాయం లేదన్నారు. ప్రభుత్వం స్థలం ఏర్పాటు చేసినట్లయితే ఎరువులకు విత్తనాల గోడౌన్, గ్యాస్ ఏజెన్సీ గోడౌన్, కొనుగోలు చేసిన ధాన్యం నిల్వకు గోడౌన్ నిర్మించుకుంటామని దానికి సరిపడా స్థలం కేటాయించాలని కలెక్టర్ ను కొత్వాల కోరారు. అనంతరం కలెక్టర్ ను సత్కరించిన సొసైటీ పాలకవర్గం సభ్యులు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్, డైరెక్టర్లు బుడ్గామ్ రామ మోహనరావు, కనగాల నారాయణరావు, చౌగాని పాపారావు, జరబన సీతారాంబాబు, మైనేని వెంకటేశ్వరరావు, యర్రంశెట్టి మధుసూధనరావు, భూక్యా కిషన్, నిమ్మల సువర్ణ, CEO G లక్ష్మీనారాయణ, మాజీ ZPTC సభ్యులు యర్రంశెట్టి ముత్తయ్య, పైడిపల్లి మహేష్, శాంతివర్ధన్ తదితరులు పాల్గొన్నారు.