పాల్వంచ, (విజయక్రాంతి): ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా చెక్ పోస్ట్ వెనుక నుండి రంగాపురం నాగారం గ్రామాల మీదుగా రవాణా చేస్తున్న అక్రమ ఇసుక లారీని నాగారం గ్రామ శివారులో పాల్వంచ మండల రూరల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు హచ్చ నాయక్, పట్టణ ఆర్.ఐ, పట్టుకొని పాల్వంచ మండల తహసిల్దార్ కార్యాలయానికి తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్రమసిక రవాణా జోరుగా సాగుతున్న విషయం విధితమే. నాగారం చెక్పోస్ట్ నుంచి కాకుండా వెనక బాగా ఉంచి దొడ్డిదారి ఆ వస్తున్న ఇసుక లారీ సమాచారం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు నాగారం గ్రామ శివారులో లారీని పట్టుకొన్నారు.