భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం బీసీ గురుకులాలకు మెస్, కాస్మోటిక్స్ చార్జీల పెంపుదలపైభద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ జ్యోతిబా పూలే గురుకుల బాలికల పాఠశాల విద్యార్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్ కి ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం తమ వసతిగృహం ఎదుట పెరిగిన మెస్, కాస్మోటిక్స్ చార్జీలు ఈ రోజు నుండే అమలుకావడంతో విద్యార్థునులు హర్షాతిరేకాల మధ్య ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలియజేసారు.
ఈ మేరకు పాఠశాల ప్రిన్సిపాల్ అరుణ క్రాంతి బీసీ గురుకుల పాఠశాలలకు చార్జీల పెంపుదలపై సంతోషం వ్యక్తం చేస్తూ అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ... బీసీ గురుకులాల్లో చదివే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చార్జీలను పెంచినందుకు గాను బాధ్యతతో కూడిన చదువును అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకొని మన విద్యా సంస్థలకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు. 6,7 తరగతుల విద్యార్థులకు రూ.950 నుండి రూ.1330 వరకు, 8,9,10 తరగతుల విద్యార్థులకు రూ.1100 నుండి రూ.1540 వరకు మెస్, కాస్మోటిక్స్ చార్జీలను పెంపుదల చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏటీపీ రమాదేవి, ఉపాద్యాయులు పాల్గొన్నారు.