calender_icon.png 21 April, 2025 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మట్టల ఆదివారం వేడుకలు

13-04-2025 07:02:06 PM

మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలోనీ వివిధ చర్చిలలో క్రైస్తవులు మట్టల ఆదివారం వేడుకలు అత్యంత  భక్తి శ్రద్ధలతో ఘనంగా  నిర్వహించారు. పట్టణం లోని సిఎస్ఐ, సెయింట్  థామస్ చర్చ్ సంఘ సభ్యులు సింగరేణి పాఠశాల మైదానం నుండి మార్కెట్ ఏరియాలో ఈత మట్టలు చేతపట్టి హోసన్న గీతం పాడుతూ పట్టణ  పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆయా చర్చిల్లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వ హించారు.

ఈ సందర్భంగా చర్చి పాస్టర్ రేవ. బంటు జెర్మీయా మాట్లాడుతూ ఏసుక్రీస్తు పునరుత్థాన పండుగను(ఈస్టర్‌) పురస్కరించుకుని ఆయన అనుభవించిన శ్రమ దినాలకు గుర్తుగా 40 రోజులపాటు క్రైస్తవులంతా ఉపవాసం లోను, దానధర్మం చేస్తారని ఆన్నారు. యేసుక్రీస్తు యెరుషలేములోకి ప్రవేశించిన రోజున మట్టలను అలంకరించి ఆయనకు స్వాగతం పలుకుతారని గుర్తు చేశారు. ఉపవాసదీక్షలు ఆఖరి వారానికి చేరుకోవడంతో ఈ వారం రోజులపాటు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించ నున్నమని ఆయన స్పష్టం చేశారు. అంతకు ముందు సండే స్కూల్ సూపర్డెంట్ సంతపురి సుమిత్ర-సునీల్ కుమార్ ల ఆధ్వర్యంలో సండే స్కూల్‌ కు చెందిన చిన్నారులు వివిధ రూపాల్లో యేసుక్రిస్తు పుట్టు పూర్వోత్తరాలు తెలిపేలా నిర్వహించిన సాంస్కతిక ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.