calender_icon.png 17 November, 2024 | 8:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పామ్ ఆయిల్ రైతులకు భారీ ఊరట

15-09-2024 12:39:04 AM

  1. దిగుమతి సుంకం 5.5 శాతం నుంచి 27.5 శాతానికి పెంపు 
  2. మంత్రి తుమ్మల విన్నపంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం

హైదరాబాద్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ముడి పామ్ ఆయిల్ దిగుమతిపై సుంకాన్ని 5.5 శాతం నుంచి 27.5 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు రాష్ర్ట వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ముడి పామ్ ఆయిల్ దిగుమతిపై సుంకాన్ని ఎత్తేయడంతో ఆయిల్ పామ్ గెలల ధర తగ్గి రైతులు రైతులపై ప్రతికూల ప్రభావం చూపిందన్నారు.

ముడి పామ్ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని పెంచి దేశీయ రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు ఈ విషయాన్ని విన్నవించినట్లు చెప్పారు. దిగుమతి సుంకం పెరగడం ద్వారా టన్ను పామ్ ఆయిల్ ధర కనీసం రూ. 1500- నుంచి రూ. 1700 వరకు పెరుగుతందని తద్వారా టన్ను ఆయిల్ పామ్ గెలల ధర రూ. 16,500 దాటే అవకాశం ఉందని తెలిపారు.