పెద్దపల్లి, నవంబర్ 23 (విజయక్రాంతి): ప్రకృతి ఒడిలో ఒదిగినట్టు ఉన్న ఈ అద్భుత దృశ్యం పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టులోనిది. మాజీ సీఎం వైఎస్ఆర్ రెడ్డి హయాంలో ఆ జలాశయం నిర్మాణం చేపట్టారు. ఆ సమయంలో ఇక్కడి ఎల్లంపల్లి గ్రామం ముంపునకు గురైంది. ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టిన సందర్భంలో గతంలో ఒకసారి ఎల్లంపల్లి గ్రామం బయట పడింది. ఇప్పుడు నీటి మట్టం తగ్గడంతో ఆ గ్రామంలోని తాటి చెట్లు ఇలా కనిపించాయి.