04-03-2025 08:49:04 PM
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని యాపల్ ప్రాంతానికి చెందిన పల్లె సమ్మయ్య బాబును తెలంగాణ మాదిగ హక్కుల దండోరా (టిఎంహెచ్డి) మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా నియమిస్తు మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు జన్ను కనకరాజు మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు కోరిపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు. ఈ మేరకు ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. దండోరాను బలోపేతం చేస్తూ వర్గీకరణ పోరాటంలో ముందుంటూ మాదిగజాతి విముక్తి కోసం ముందుండి పోరాడాలన్నారు. అనంతరం నూతన అధ్యక్షులు పల్లె.సమ్మయ్య మాట్లాడుతూ... నాపై నమ్మకం ఉంచి నాకు ఇంతటి బాధ్యతను అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎస్సీ వర్గీకరణ సాధించేవరకు మాదిగ జాతి ఐక్యత కోసం, అభివృద్ధి కోసం పాటుపడతానని జిల్లాలో సంఘాన్ని బలోపేతం చేస్తూ జాతి హక్కుల కోసం నిరంతరం పోరాడుతానని ఆయన స్పష్టం చేశారు.