calender_icon.png 14 October, 2024 | 3:46 PM

సంకల్పంతో ముందుకెళ్లాం.. అనుకున్న విజయాన్ని సాధించాం

14-10-2024 01:15:51 PM

అమరావతి,(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా 'పల్లె పండుగ-పంచాయతీ వారోత్సవాలు' ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. కంకిపాడులో నిర్వహించిన 'పల్లె పండుగ' సభకు డిప్యూటీ సీఎం పవన్ హాజరై అభివృద్ధి పనులకు శిలాఫలకం ఆవిష్కరించారు. రూ.95.15 లక్షలతో రోడ్లు, మినీ గోకులాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రైతుల కష్టాలను తీర్చేందుకు తము వచ్చామని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

దేశ చరిత్రలో లేనివిధంగా ఒకేరోజు అన్ని పంచాయతీల్లో గ్రామసభలు పెట్టుకున్నామని, రూ.4500 కోట్లతో 30 వేల పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యమన్నారు. పాలన ఎలా చేయాలన్న దానిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సూర్తి అని పవన్ చెప్పారు. పరిపాలన అనుభవం కావాలంటే ఎంతో కృషి చేయాలని, రాష్ట్రానికి ఉన్న బలమేంటంటే సీఎం చంద్రబాబుకు ఉన్న అపార అనుభవం అని కొనియాడారు. టీడీపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లాలని ఆనాడు తీసుకున్న నిర్ణయం సరైనదే అని ఏపీ డిప్యూటీ సీఎం తెలిపారు.

సంకల్పంతో ముందుకెళ్లాం.. అనుకున్న విజయాన్ని సాధించాం అని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం బలంగా ఉన్నప్పుడే అనుకున్నది సాధ్యమవుతుందన్నారు. ప్రతి పంచాయతీలో ఏం పనులు జరుగుతున్నాయి అనేది ప్రజలకు తెలియాలని ప్రతి పంచాయతీ కార్యాలయంలో సిటిజన్ నాలెడ్జ్ బోర్డు ఏర్పాటు చేయాలని, పనులపై డిస్ ప్లే బోర్డులు, దాపరికం లేదు.. అన్నీ వివరాలు డిస్ ప్లే బోర్డుల్లో ఉండాలని డిప్యూటీ సీఎం పవర్ కళ్యాణ్ ఆదేశించారు.