calender_icon.png 29 April, 2025 | 9:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యలు తెలుసుకున్నేందుకే ‘పల్లెనిద్ర’

28-04-2025 01:16:00 AM

కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రావి శ్రీనివాస్

చింతలమానేపల్లి, ఏప్రిల్27(విజయక్రాం తి): సమస్యలు తెలుసుకునేందుకే పల్లెనిద్ర చేపడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రావి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని కోయపల్లిగ్రామంలో బస చేసిన ఆయన ఆదివారం గిరి గ్రామాలైన నాగపల్లి, సోమిని, తలాయి, పాపన్నపేట్, కమ్మర్గాం , నాగపల్లి లో పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా కృషి చేస్తానని తెలిపారు.

దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. అన్హరులకు పథకాలు మంజూ  రు అయితే వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కొంతమంది నాయకులు పేద ప్రజలను మాయ మాటలు చెబుతూ తిరుగుతున్నారని అలాం టి వారిని నమ్మవద్దని తెలిపారు.