calender_icon.png 14 January, 2025 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ పసుపు బోర్డ్ చైర్మన్ గా పల్లె గంగారెడ్డి

13-01-2025 07:54:49 PM

నిజామాబాద్ ను వరించిన జాతీయ చైర్మన్ పదవి... 

నిజామాబాద్ (విజయక్రాంతి): జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ గా పల్లె గంగారెడ్డిని నియమిస్తూ భారత ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్(MP Dharmapuri Aravind) కి అత్యంత సన్నిహితుడు జిల్లాకు చెందిన పల్లె గంగారెడ్డికి కేంద్ర చైర్మన్ పదవి లభించడంతో బిజెపి శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. పదేళ్లుగా పసుపు బోర్డు రాజకీయ వర్గాలకు ఆరోపణలు ప్రత్యారోపణలకు కేంద్ర బిందువుగా నిలిచింది. ప్రతిపక్షాలు అరవిందుపై ఆరోపణలు చేస్తూ పసుపు బోర్డు విషయమై తరచూ ఎమ్మెల్యేని ప్రశ్నించేవారు. పల్లె గంగారెడ్డికి నిజామాబాద్ పసుపు బోర్డు చైర్మన్ గా కేంద్రం ప్రకటించడంతో ప్రతిపక్షాలు ఇరుకునపడ్డాయి. పల్లె గంగారెడ్డి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. గతంలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.