- ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం
- ఎంపీ అర్వింద్‌కు అత్యంత సన్నిహితుడిగా ‘పల్లె’
నిజామాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): జాతీ య పసుపు బోర్డు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని నియమిస్తూ కేంద్రం ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు అత్యంత సన్నిహితుడు అయిన గంగారెడ్డికి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పదవి వరించడంతో జిల్లాకు చెందిన బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పదేళ్లుగా పసుపు బోర్డు రాజకీయ వర్గాల్లో విమర్శలకు కేం ద్రబిందువుగా నిలిచింది. ప్రతి పక్షాలు ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణపై తరచూ విమర్శలు చేసేవారు. పల్లె గంగారెడ్డిని పసుపు బోర్డు చైర్మన్ గా కేంద్రం ప్రకటించడంతో ప్రతిపక్షాలు ఇరుకునపడ్డాయి. పల్లె గంగారెడ్డి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. గతంలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.