calender_icon.png 16 January, 2025 | 11:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లె దవాఖాన ప్రారంభం ఎప్పుడో..?

05-09-2024 05:07:05 PM

నిర్మించి నిరుపయోగంగా ఉన్న పల్లె దవాఖాన

దుబ్బాక,(విజయక్రాంతి): మారుమూల గ్రామాలలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి గత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె దవాఖానలు నిర్మించింది. అది కాంట్రాక్ట్ నిర్లక్ష్యమా లేక అధికారుల నిర్లక్ష్యమో కానీ ప్రారంభనికి నోచుకోలేదు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలోని పల్లె దవాఖాన ఇందుకు నిదర్శనం. గ్రామంలో  కొన్ని నెలల క్రితం పేద ప్రజల కొరకు మెరుగైన వైద్యం అందుబాటులో ఉండాలని పల్లె దవాఖానను నిర్మించారు.

నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా మరో వైపు వర్షాకాలం కావడంతో దవాఖాన చుట్టూ పిచ్చి మొక్కలు పెరుకపోయి పాడుబడ్డ భవనంల తయారైయిందని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సంబంధిత అధికారులను ఆదేశించి చొరవ తీసుకొని పేద ప్రజల కొరకు నిర్మించిన పల్లె దవాఖానను అందుబాటులోకి తీసుకు రావాలని వేడుకుంటున్నారు.