నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని అభయ ఆంజనేయ దత్తాత్రేయ ఆలయంలో నిర్వహిస్తున్న సాయి పాదుకల పారాయణలో భాగంగా చివరి రోజు అయిన బుధవారం పల్లకి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయిబాబా వేషధారణలో సాయి నామస్మరణ చేస్తూ పల్లకి సేవ నిర్వహించగా ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. సాయి దీక్ష సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు.