06-04-2025 01:10:34 AM
హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్ల గొండ జిల్లాలకు సాగు, తాగునీటిని అందించేందుకు నిర్మించతలపెట్టిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఫేజ్-1 పనులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తిచేస్తామని భారీ సాగునీటిపారుదలశాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో శనివారం ఆయన అధికారు లతో పాలమూరు-రంగారెడ్డి, జూరాల ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. పాలమూరు ఫేజ్-1
పనులను డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయడంతో పాటు 3వ ప్యాకేజీ పరిధిలోని నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు కాలువల తవ్వకాలను వెంటనే చేపట్టి ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.
నార్లాపూర్ (6.40 టీఎంసీలు), ఏదుల (6.55 టీఎంసీలు), వట్టెం (16.70 టీఎంసీలు), కరివెన (19 టీఎంసీలు) రిజర్వాయర్ల అన్ని పనులను పూర్తిచేయడంతో పాటు వీటన్నింటినీ ఈ ఏడాది చివరి నాటికి సుమారు 50 టీఎంసీలకు పైగా సామర్థ్యంతో నింపాలని సూచించారు. 400 కేవీ సబ్‌స్టేషన్ పనులు పూర్తి చేసేందుకు గాను రూ.262 కోట్లను విడుదల చేశామని..
ఈ ఏడాది జూలై చివరి నాటికి ఏదుల, వట్టెం పంపింగ్ స్టేషన్ల డ్రైరన్‌ను చేపడతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట, నాగర్‌కర్నూలు జిల్లాలకు సాగునీటిని అందించే జూరాల ప్రాజెక్టులో పూడిక భారీగా పెరిగిపోయి ప్రాజెక్టు సామర్థ్యం బాగా తగ్గిపోయిందని మంత్రి పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉన్న నీటినిల్వ సామర్థ్యంతో వరద జలాలను ఒడిసిపట్టే పరిస్థితి లేకుండాపోయిందని అందుకే ప్రాజెక్టు పూర్తి నీటిమట్టాన్ని 12టీఎంసీలకు పెంచుతామని తెలిపారు. వ్యవసా యానికి, తాగునీటికి నీటి వనరులను సద్వినియోగం చేసుకునేందుకు తమ ప్రభుత్వం ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. సాగునీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్, నీటిపారుదల శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.