calender_icon.png 18 January, 2025 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్పొరేట్‌కు దీటుగా పాలమూరు హాస్పిటల్

18-01-2025 02:19:38 AM

  1. ఉగాది నుంచి ఎంఆర్‌ఐ స్కానింగ్ సేవలు 
  2. త్వరలో అందుబాటులోకి సూపర్ స్పెషాలిటీ సేవలు
  3. ఉమ్మడి జిల్లాలో హాస్పిటళ్ల అభివృద్ధికి వంద కోట్లు 
  4. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): మహబూబ్‌నగర్ జనరల్ హాస్పి టల్‌ను కార్పొరేట్ హాస్పిటళ్లకు దీటుగా తీర్చిదిద్దుతామని ఆరోగ్యశాఖ మంత్రి దామో దర రాజనర్సింహ తెలిపారు. హాస్పిటల్‌లో ఎంఆర్‌ఐ స్కానింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

సుమారు రూ.10 కోట్లతో ఎంఆర్‌ఐ యంత్రం ఏర్పాటు చేసి, ఉగాది నుంచి సేవలు ప్రారంభిస్తామన్నారు. త్వరలోనే కార్డియాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను సైతం మహబూబ్‌నగర్‌లో అందుబాటులోకి తీసుకొస్తామ న్నారు.

ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని మెడికల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో జరిగిన సమీక్షలో మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలోని హాస్పిటళ్ల పనితీరు, వైద్యారోగ్య సేవలపై మంత్రి రివ్యూ చేశారు. ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, మధుసూదన్‌రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, కూచకుళ్ల రాజేశ్ రెడ్డి, శంకర్, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో ట్రీట్‌మెంట్ కోసం పేషెంట్లు హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తోందని ఎమ్మెల్యేలు మంత్రికి విన్నవించారు. మంత్రి మాట్లాడుతూ.. వీలైనంత తొందరలో సూపర్ స్పెషాలిటీ డిపార్ట్‌మెంట్లను ఏర్పా టు చేస్తామని హామీ ఇచ్చారు.

ఉమ్మడి జిల్లా లో ఉన్న 5 మెడికల్ కాలేజీలు, జనరల్ హాస్పిటళ్లు, జిల్లా, ఏరియా హాస్పిటళ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇందుకోసం సుమా రు వంద కోట్లు ఖర్చు అవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. 

కొత్తగా 4 సెంట్రల్ మెడిసినల్ స్టోరేజ్ సెంటర్లు 

ఉమ్మడి జిల్లాలో కొత్తగా 4 సెంట్రల్ మెడిసినల్ స్టోరేజ్ సెంటర్లు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. మెడిసిన్ సప్లయ్, పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకో త్రీమెన్ కమిటీ వేశామన్నారు. హాస్పిటళ్లలో మెడిసిన్ ఉండేలా చూసుకునే బాధ్యత ఈ కమిటీదేనన్నారు. ఎక్కడైనా మెడిసిన్ లేవని పేషెంట్లకు ఇబ్బంది కలిగిస్తే కమిటీపై చర్యలుంటాయని హెచ్చరించారు.

డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత డీఎంహెచ్‌వోలు, హాస్పిటల్ సూపరింటెండెంట్లదేనని మంత్రి గుర్తు చేశారు. హాస్పిటళ్లలో ఆకస్మిక తనిఖీల కోసం రాష్ర్ట స్థాయిలో టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీలు ఎప్పుడైనా తనిఖీలకు రావొచ్చని, ఆ సమయంలో డ్యూటీలో లేకపోతే వెంటనే చర్యలుంటాయన్నారు.