27-02-2025 12:00:00 AM
మొన్న జరిగినశ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీ సీ) సొరంగం ప్రమాద ఘటన ఎన్నో సాంకేతిక విషయాలను బయటకు తీసుకువస్తుంది. తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా డక్కన్ పీఠభూమిపై ఉన్నది. ఇక్కడి శిలలు , రాళ్లు కొన్ని కోట్ల సంవత్సరాల (ఆర్చియ న్ ఏజ్ రాక్స్) పూర్వం అగ్నిశిలలు బద్దల యి లావా ప్రవహించి ఏర్పడిన భూమి. ఇక్కడ ముఖ్యంగా భారీ నీటి ప్రాజెక్టులు నిర్మించాలంటే సాంకేతికంగా చాలా బలం గా ఉండాలి. నల్లగొండ జిల్లా వాసులకి నీరు అందించాలనే లక్ష్యంతో ఎస్‌ఎల్‌బీసీ సొరంగ నిర్మాణం 1970వ దశకంలోనే పనులుకు శ్రీకారం చుట్టారు.
ఇది దాదా పు 42 కిలోమీటర్ల భారీ సొరంగ నిర్మా ణం. వాస్తవానికి మన దగ్గర ఉండే శిలలు అత్యంత బలంగా (హార్‌డ రాక్స్) ఉండే శిలలు. దాదాపు 2010 నాటికి డ్రిల్ అండ్ బ్లాస్టింగ్ మెథడ్(డీబీఎం) పద్ధ్దతి మాత్రమే అందుబాటులో ఉండేది. ఇది చాలా కఠినమైన పద్ధతి. తర్వాత టన్నెల్ బోరింగ్ మెషి న్(టీబీఎం) పద్ధతి ద్వారా సొరంగ నిర్మాణాలు చేస్తున్నారు. శ్రీశైలం ఎడమ కాలువ నుంచి డిండి వరకు దట్టమైన అడవుల గుండా ఈ సొరంగ మార్గం వెళ్తుంది. ఈ కఠినమైన శిలలను డ్రిల్లింగ్ చేసి సొరంగం చేయడం అసాధ్యం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లో చాలా స్పష్టం గా వివరించారు.
భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో టన్నెల్ నిర్మాణాలు సహజం. కానీ కొన్ని కారణాల వలన ఇటీవలి కాలంలో టన్నెల్ నిర్మాణాలు ప్రమాదాలకు గురవు తూ వస్తున్నాయి. ఇటీవల మన దేశంలో ఉత్తరాఖండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోఇటువం టి ప్రమాదాలు చోటు చేసుకోవడం చూస్తూ ఉన్నాము. మన రాష్ట్రంలో ఈ ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటన అటు సాంకేతి కంగాను , భౌగోళికంగాను ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. టన్నెల్ నిర్మాణాలు ఎప్పుడు చేయాలి? కావలసిన చర్యలు ఏమిటనే విషయాలను తెలుసుకుందాం.
టన్నెల్ నిర్మాణాలు ఎప్పుడు చేపట్టాలి ?
నీటిని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తరలించడానికి గుట్టలు లేదా పర్వ తాల గుండా వెళ్లాల్సిన అవసరం ఉన్నప్పు డు టన్నెల్ నిర్మాణాలు చేపట్టాలి. రహదారులు, పట్టణాలు, రైల్వే మార్గాలు లేదా పర్యావరణ పరంగా సంరక్షించాల్సిన ప్రాంతాల కిందుగా నీరు తీసుకెళ్లాల్సిన పరిస్థితుల్లోనూ ఈ టన్నెల్ నిర్మాణం చేపట్టాలి. నదులు, చెరువులు లేదా లోతైన లోయలు దాటించాల్సిన అవసరం ఉన్నప్పుడు. నీటి చేరిక (సీపేజ్) సమస్యలు ఉన్నప్పుడు భూగర్భజల మట్టం అధికం గా ఉండే లేదా అధిక పారగమ్యత గల నేలలలో (పోరస్ సాయిల్) ఉన్నప్పుడు టన్నెల్ నిర్మాణాలు చేపట్టాలి.
టన్నెల్ నిర్మాణంలో సమస్యలు
టన్నెల్ నిర్మాణంలో ప్రధాన సవాళ్లలో ఒకటి భౌగోళిక, జలవిజ్ఞాన సంబంధిత పరిస్థితులను సమర్థవంతంగా నిర్వహించ డం. గ్రౌండ్‌వాటర్ ప్రవాహం కారణంగా ముంపు సంభవించడం, లేదా టన్నెల్ లైనింగ్ బలహీనపడటానికి దారితీసే ప్రమాదం ఉంటుంది. అందువల్ల, వాటర్‌ప్రూఫ్ మెంబ్రేన్లు, గ్రౌటింగ్, డీవాటరింగ్ వ్యవస్థల వినియోగం అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది.
ఎస్‌ఎల్‌బీసీతో తలెత్తిన సమస్య
టన్నెల్ నిర్మాణ భద్రత కేవలం వివిధ రకాల రాళ్లు, భూమి ద్వారా టన్నెల్స్ నిర్మించడానికి మాత్రమే పరిమితం కాదు. ఇది నిర్మాణ సమయంలో సంభవించే అనేక ఇతర ప్రమాదాలకు కూడా సంబంధించినది. ప్రధాన ప్రమాదాలలో ఒకటి, సరిగా రూపొందించని డిజైన్, తగిన మద్ద తు వ్యవస్థల లేకపోవడం లేదా అనుకోని పరిస్థితుల కారణంగా టన్నెల్ కూలిపోవ డం. శ్రీశైలం నల్లమలలో టైగర్ జోన్ ఉండడం, పర్యావరణ సమస్యలు రావడం ద్వారా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు నిదానంగా సాగుతూ వస్తున్నాయి. టన్నెల్ నిర్మాణంలో భద్రత అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశంగా పరిగణించవచ్చు. టన్నె ల్ అనేది క్లోజ్డ్ అలాగే పరిమిత స్థలంగా ఉండటంతో, కార్మికులు గాలి నాణ్యత, శబ్దం మరియు వైబ్రేషన్ల్లు వంటి అనేక ప్రమాదాలకు గురవుతారు. మొన్న జరిగిన ప్రమాదం ఇటువంటిదే.
ప్రధాన భద్రతా సవాళ్లు, పరిష్కారాలు
టన్నెల్ నిర్మాణంలో అనేక భద్రతా సవాళ్లు ఉంటాయి. అందులో నిర్మాణ స్థిర త్వం, అగ్ని ప్రమాదం, హానికరమైన పని పరిస్థితులు, అనూహ్య భూభౌతిక సంఘటనలు ముఖ్యమైనవి. టన్నెల్ కూలిపోవ డమే ప్రధాన ప్రమాదం. ఇది తగిన వ్యవస్థల లేమి లేదా అనుకోని భూగర్భ పరిస్థి తుల వల్ల సంభవించవచ్చు. దీనిని నివారించేందుకు, ఇంజినీర్లు రాక్ బోల్ట్స్, షాట్ క్రీట్, స్టీల్ రిబ్స్ వంటి మద్దతు విధానాల ను ఉపయోగించి టన్నెల్ నిర్మాణాన్ని బలపరిచే చర్యలు తీసుకుంటారు. వెంటిలేషన్ వ్యవస్థలు కార్మికులను ధూళి, విష వాయువుల వల్ల కలిగే శ్వాస సంబంధిత వ్యాధుల నుండి రక్షిస్తాయి. కార్మికులు తప్పనిసరిగా హెల్మెట్లు, మాస్కులు, హియరింగ్ ప్రొటెక్షన్ వంటి వ్యక్తిగత భద్రతా పరికరాలను ధరించాలి.
టన్నెల్ ప్రాజెక్టులో ప్రతి కార్మికుడికి ఎలక్ట్రానిక్ రిసీవర్ అమర్చడం ద్వారా, వారి స్థానం సకాలంలో ట్రాక్ చేయబడుతుంది. తద్వారా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కార్మికులను త్వరగా గుర్తించి ఖాళీ చేయడం సాధ్యమవుతుంది. అధునాతన సాంకేతికతలు, రియల్ -టైమ్ మాని టరింగ్ (ఆర్‌టీఎం) వ్యవస్థలు, డిజిటల్ మోడలింగ్ టూల్స్, సంభవించగల ప్రమాదాలను ముందుగా గుర్తించి, వేగంగా స్పందించేలా సహాయపడతాయి, తద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చు.
అడుగడుగునా ఆటంకాలు
అయితే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నిర్మాణం చేపడుతున్న జేపీ గ్రూపు సంస్థకు చెందిన జయప్రకాశ్ అసోసియేట్స్ ఇలాంటి భారీ నిర్మాణాలు చేపట్టడంలో పేరెన్నికగన్న సంస్థ. టన్నెల్ నిర్మాణానికి సంబంధించి అన్ని జాగ్రతలు తీసుకునే ఉంటుంది. ఇది మానవతప్పిదం కాదని, అనుకోకుండా జరిగిన ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. 2005లో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ టన్నెల్ నిర్మాణానికి సం బంధించి అగ్రిమెంట్ కుదిరింది. ఎనిమిదేళ్ల సమయంలో ఈ టన్నెల్ నిర్మాణం పూర్తి చేయాలని ఆ సమయంలో నిర్ణయించారు. 2005లో ఒప్పందం కుదిరినప్ప టికీ అసలు పనులు 2007లో ప్రారంభమయ్యాయి.
టన్నెల్ బోరింగ్ మెషిన్లు చెడి పోవడం, కొవిడ్ సమయంలో ఇతర దేశాలనుంచి వచ్చిన ఇంజినీర్లు, ఆపరేటర్లు స్వస్థలాలకు వెళ్లిపోవడం జరిగింది. పదేళ్ల కేసీఆర్ హయాంలో తగినన్ని నిధులు కేటాయించలేదన్న విమర్శలున్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నల్లగొండ జిల్లాకే చెందిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమా ర్ రెడ్డి ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి శ్రద్ధ చూపించడంతో ఈ మధ్యనే పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద నీటిపారుదల నిర్మాణంగా పేర్కొనే ఈ టన్నెల్ నిర్మాణం పూర్తి కావడానికి మరో మూడేళ్లు పడుతుందని భావిస్తున్న తరుణంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో పనులు మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది.
పాలమూరు , కాళేశ్వరమే ప్రత్యామ్నాయం
ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాకు నీరు అందించాలనే లక్ష్యంతో పాలమూరు రంగారెడ్డి నిర్మాణాన్ని చేపట్టారు. కాళేశ్వరం ద్వారా తుంగతుర్తి, సూర్యాపేట వరకు ఈరోజు నీరు అందుతోంది . పాలమూరు రంగారెడ్డి నిర్మాణం పూర్తయితే దాదాపు 10 లక్షల ఎకరాలు వరకు నల్లగొండ జిల్లాకు నీరు అందించవచ్చు.భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టు నిర్మా ణాల్లో ఇంటిగ్రేటెడ్ విధానంలో నిర్మించాలని ఇంజనీర్లు భావిస్తున్నారు. ఇంటర్ లిం కింగ్ ద్వారా కూడా నీటిని సద్వినియోగం చేసుకోవచ్చు. టన్నెల్ నిర్మాణాల్లో సాంకేతిక వాడకం, కార్మికుల భద్రత దృష్ట్యా వారికి ముందస్తుగానే సాంకేతికత మీద అవగాహన ఇస్తూ ప్రాజెక్టులు నిర్మించాల్సిన అవసరం ఉంది.
-కన్నోజు శ్రీహర్ష