ముషీరాబాద్,(విజయక్రాంతి): యూఎస్ఆర్ఎస్పీ ఆధ్వర్యంలో సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో పాకాల అలయ్ బలయ్ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. గ్రామానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని చిన్ననాటి ముచ్చట్లను చర్చించుకున్నారు. ఈ గ్రామానికి చెందిన తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ జిలకర రవికుమార్ గ్రామానికి చెందిన నగరంలో స్థిరపడిన పలువురు ప్రముఖులు డాక్టర్ వి.విద్యాకుమార్, పి.సోమయ్య, బి.సుధాకర్, జి.ప్రకాష్, చిలుక ప్రసాద్, రూపాల నర్సయ్య, మాచారపు ఎల్లయ్య, జక్కు జీవరత్నం, తార, జి.లక్ష్మయ్య, స్వామిదాస్, నాగార్జున, చంద్రమౌళి తదితరులు మాట్లాడారు. పాకాల గ్రామానికి 200 ఏళ్ల చరిత్ర ఉందని, నిజాం కాలం నుంచి కూడా ఈ గ్రామానికి ప్రత్యేకత ఉందన్నారు. పాకాల గ్రామాన్ని అందరి భాగస్వామ్యంతో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించామన్నారు. విద్య వైద్యాన్ని అందరికి అందుబాటులోకి తీసుకువచ్చి గ్రామాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా నిలపాలన్నదే తమ లక్ష్యమన్నారు. గ్రామంలోని యువతను మంచి మార్గంలో నడిపించడానికి పలు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలను పూర్తిగా అభివృద్ధి చేసి పూర్వవైభవం తీసుకువస్తామని, విద్యార్థుల సంఖ్యను పెంచుతామన్నారు.