ఖమ్మం (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో జిల్లా ఓబీసీ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బిసి సంక్షేమ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలియజేసి వారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పునుకొల్లు నీరజ హాజరై చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా కనివిని ఎరగని రీతిలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన నిర్వహించడం, దాన్ని అమలుపరచడం దేశ చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో లికించబడుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల ఉన్న గౌరవాన్ని ఈరోజు అసెంబ్లీలో సర్వే రిపోర్టును ప్రవేశపెట్టడాన్ని బీసీలు మొత్తం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా రేపు రిపోర్టును ప్రవేశపెట్టిన మంత్రి మండలకి ,ముఖ్యమంత్రికి ,డిప్యూటీ ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ సెల్ ఉపాద్యక్షులు బమ్మిడి శ్రీనివాస్ యాదవ్, గజ్జి సూర్యనారాయణ, కార్పొరేటర్లు రాపర్తి శరత్, కన్నం వైష్ణవిప్రసన్న, గజ్జల లక్ష్మీ వెంకన్న, కొప్పెర సరిత ఉపేందర్, పల్లెబోయిన భారతి చంద్రం, చామకూరి వెంకటనారాయణ, నగర ఓబీసీ సెల్ అద్యక్షులు బాణాల లక్ష్మణ్, మైనారిటీ అద్యక్షులు షేక్ అబ్బాస్ భేగ్, నగర ఓబీసీ సెల్ ఉపాద్యక్షులు సంపటం నరసింహరావు, హారికా నాయుడు, పర్వత శ్రీనివాస్, బలుసు లక్ష్మి, సందీప్, చింతల ఉపేందర్, భవాని, జ్యోతి, రమాదేవి, శ్రీనివాస్, సీహెచ్ వెంకన్న, బత్తుల వీరబాబు, దొడ్డా రామారావు, జీవీవీఎల్ నరసింహరావు, తిరుమలశెట్టి జయప్రకాష్ విష్ణు, కె. శివ, హరనాథ్, కృష్ణ, జాని, షేక్ పాషా,కె. శ్రీనివాస్, వి.శ్రీనివాస్, ఫరీద్ ఖాద్రి, సుగుణ, యశ్వంత్ తదితర నాయకులు పాల్గొన్నారు.