calender_icon.png 19 March, 2025 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పలాభిషేకం

19-03-2025 05:25:31 PM

చేగుంట (విజయక్రాంతి): చేగుంట పట్టణ కేంద్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కొలుపుల రామస్వామి మాదిగ ఆధ్వర్యంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగకి పాలాభిషేకం చేయడం జరిగింది. 30 ఏళ్ల పోరాట ఫలితం ఏ,బి,సి,గా అమలు పరచుకోవడం జరిగింది. దానికి మందకృష్ణ మాదిగకి కృతజ్ఞతగా పాలాభిషేకం జరపడం జరుగుతుందన్నారు. ఆయన పోరాట ఫలితమే ఈరోజు ఏబీసీగా మూడు గ్రూపులుగా ప్రభుత్వం అమలు చేయడం చాలా సంతోషం ఇది కేవలం మందకృష్ణ మాదిగ వల్లనే సాధ్యమైంది.

ఈ క్రెడిట్ మాదిగ అమరవీరులకు అంకితం ఇస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కొలుపుల రామస్వామి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బక్క సాయి బాబా, మండల కోశాధికారి, మండల సలహాదారులు కోన్ మండల శంకర్, మండల ఉపాధ్యక్షులు నీల రాములు, రాష్ట్ర నాయకులు మద్దూరు కృష్ణ జిల్లా ఎమ్మెస్పీ అధ్యక్షులు మురళి మాదిగ, జిల్లా ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కుకునూరు స్వామి మాదిగ, గణేష్, ఉర్య ఆగము, లక్ష్మీనారాయణ, తోట సురేష్, గణేషు, వరిగంటి నరేష్, చిట్టపురం సంజు, యాపర్ల నర్సింలు, తదితరులు పాల్గొనడం జరిగింది.