calender_icon.png 1 March, 2025 | 11:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం

28-01-2025 06:59:30 PM

మంథని (విజయక్రాంతి): మంథని ప్రధాన చౌరస్తాలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి ఎంఆర్పీఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఆయన చేసిన సామాజిక సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకుగాను ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మంథని చందు మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి పొట్ల రమేష్ మాదిగ, మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు అక్కపాక సంపత్ కుమార్ మాదిగ, మాదిగ కళాకారుల పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఏట రవి మాదిగ, మాదిగ కళాకారుల మంథని డివిజన్ అధ్యక్షులు ఆరెపల్లి నాగరాజు మాదిగ, మంథని సత్యం, బూడిద శంకర్, బూడిద తిరుపతి, మంథని లక్ష్మణ్, తగరం శంకర్ లాల్  మాట్లాడుతూ... ఫిబ్రవరి 7న హైదరాబాదులో జరిగే లక్ష డప్పులు, 1000 గొంతులు కార్యక్రమాన్ని మంథని నియోజకవర్గంలోని మాదిగలు, మాదిగ ఉపకులాలు విద్యార్థులు ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంథని లింగయ్య, అక్కపాక సది, మంథని శీను, వేల్పుల గట్టయ్య, కాసిపేట ప్రభాకర్, కడారి సంపత్, వేల్పుల రాజు, పోయిల సుమన్, వేల్పుల పోషం, వేల్పుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.