హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద శుక్రవారం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Padi Kaushik Reddy) ప్లెక్సీకి బిఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రజా సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే ప్రశ్నిస్తుంటే గిట్టని కాంగ్రెస్ నాయకులు దిష్టిబొమ్మ దహనం చేశారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు చేసినట్లుగా తాము కూడా సీఎం(CM Revanth Reddy) దిష్టిబొమ్మను జంతువులపై పెట్టి ఊరేగింపు చేయవచ్చు అది మా సంస్కారం కాదని అన్నారు. కాంగ్రెస్ నాయకులకు చేతనైతే ప్రజలకు మేలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు హర్షద్, ఇర్ఫాన్, భరత్ రెడ్డి, రాము తదితరులు పాల్గొన్నారు.