calender_icon.png 30 April, 2025 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందూరులో పాకిస్థానీలు?

30-04-2025 12:04:52 AM

  1. పాకిస్థానీలను పెళ్లాడిన మహిళలు 
  2. విడాకుల పేరుతో ఇందూరులో తిష్ఠ 
  3. మహిళలు ఐదుగురు పురుషులు ముగ్గురు 

నిజామాబాద్, ఏప్రిల్ 29 (విజయ క్రాంతి): జమ్మూ కాశ్మీర్ పహేల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమై రాష్ర్ట ప్రభుత్వాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు తగు సూచనలు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తానీల వివరాలు పాకిస్తాన్ కు చెందిన కుటుంబాలు అక్కడివారిని పెళ్లి ఆడిన వారి వివరాల సేకరిస్తోంది.

ఇందులో భాగంగా నే తెలంగాణ రాష్ర్టంలోని నిజామాబాద్ జిల్లాలో పాకిస్తానీల వివరాలు సేకరించే పనిలో ఎస్ బి సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. పెహేల్గాం ఉగ్ర దాడుల నేపథ్యంలో తెలంగాణ రాష్ర్టంలోని సున్నిత ప్రాంతాలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు స్టేట్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లు పాకిస్తాన్ నీల జాడలు కనుగొనడంలో తల మునకలై ఉన్నారు.

తెలంగాణ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో హై అలర్ట్  ప్రకటించగా కర్ణాటక మహారాష్ర్ట సరిహద్దు ప్రాంతమైన నిజామాబాద్ జిల్లాలో కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎస్ బి పోలీసులు జిల్లాలోని విదేశీయుల వివరాలు ముఖ్యంగా పాకిస్థానీల వివరాలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో పాకిస్తానీలు ఎంతమంది ఉన్నారు. ఏ ప్రాంతంలో ఉన్నారు తదితర వివరాలు సేకరిస్తున్నారు. 

దేశంలో ఎక్కడా ఉగ్ర దాడులు జరిగిన కూడా వాటి మూలాలు నిజామాబాద్ కరీంనగర్ జగిత్యాల జిల్లాలో ఉంటున్నాయి. గతంలో నిజామాబాద్ జిల్లా గుండారం గ్రామంలో పి ఎఫ్ ఐ పీపుల్స్ ఫ్రంట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముస్లిం యువకులను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్ బాంబు పేలుళ్ల సంఘటనలో మలక్పేట్ సాయిబాబా గుడి వద్ద పేలిన స్కూటర్ బాంబు  నిజామాబాద్ కు చెందినదిగా పోలీసులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో పోలీసులు డేగ కన్ను వేసి పాకిస్తాన్ దేశంతో సంబంధాలు ఉన్నవారు తరచూ పాకిస్తాన్ ఫోన్ కాల్ సంభాషిస్తున్న వారి వివరాలు ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. పాకిస్తాన్ వెళ్లి వచ్చిన వారి వివరాలు కూడా అధికారులు సేకరించారు. నిజామాబాద్ జిల్లా లో ఫిమేల్ ఐదుగురు మెల్ ముగ్గురు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. పాకిస్తాన్ నీ లని ను పెళ్లాడిన నిజామాబాద్ మహిళలు వారి వివరాలను కూడా పోలీసులు సేకరించారు 

నిజామాబాద్ జిల్లా తో పాటు పోరుగు జిల్లాలో అనుమానాస్పద కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు అనిపిస్తే... అనుమానాస్పదంగా వ్యక్తులు కనబడితే అప్రమత్తమై వెంటనే దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు.  తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా పాకిస్తాన్ కి ప్రయాణించిన వారి వివరాలు ఎస్ బి పోలీసులు సేకరించారు.

గతంలో నకిలీ పాస్పోర్ట్  కేసులో పట్టుబడిన వారి వివరాలు వారి ద్వారా ఎంతమంది  విదేశాలకు దేశాల నుంచి వచ్చినవారు స్థానికంగా పాస్పోర్ట్ పొంది నిజామాబాద్ జిల్లాలో తిష్ట వేశారు తదితర వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు . తెలంగాణ రాష్ర్టంలో ఉగ్ర మూలాలు కలిగి ఉన్న 14 ప్రాంతాలను హై అలెర్ట్ జోన్లుగా ప్రకటించారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూకట్పల్లి నాంపల్లి మహాత్మా గాంధీ బస్ స్టాండ్ ట్యాంక్ బండ్ తో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తో పాటు అలిపిరి విశాఖ రైల్వే స్టేషన్ జగదాంబ జంక్షన్ రామకృష్ణ బీ విజయవాడ రైల్వే స్టేషన్ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఎంజీ రోడ్డు తదితర ప్రాంతాల్లో ప్రజల అప్రమత్తంగా ఉండి అవసరమైతేనే ఆ మార్గం గుండా వెళ్లాలని సూచిస్తున్నారు.

  జమ్మూ కాశ్మీర్ పెహల్గాం ఉగ్రవాదుల దాడుల నేపద్యంలో అప్రమత్తమైన తెలంగాణ సర్కార్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల్ కరీంనగర్ బైంసా తదితర సున్నిత ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టి అప్రమత్తమయ్యారు. ప్రత్యేక పోలీసు దళాలతో అనుమానం ఉన్న ప్రతి ప్రాంతంలో జల్లెడ పట్టి అనుమానాస్పదంగా ఉండే వారిని అదుపులోకి తీసుకునీ ప్రశ్నిస్తున్నారు.

అసంపూర్తి వివరాలతో ఉన్నవారిని అదుపులోకి తీసుకుంటున్నారు, వివిధ మార్గాల ద్వారా దేశంలోకి చొరబడి పై ప్రాంతాల్లో  నివాస లు ఏర్పరచుకొని స్థిరంగానివాసం ఉంటున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. ఇటీవల ఈ ప్రాంతాల నుండి విదేశాలకు వెళ్లి వచ్చిన వారి వివరాలు తరచూ పాకిస్తాన్ బాంగ్లాదేశ్ ఆఫ్గనిస్తాన్ వెళ్లి వచ్చిన వారి వివరాలు సేకరించే పనిలో నిఘా వర్గాలు నిమగ్నమయ్యాయి.

గత రెండు దశాబ్దాల క్రితం నిజామాబాద్ జిల్లాలో పాకిస్తానీల సంఖ్య అధికంగా ఉండింది వారు స్థానిక కళాశాలలో తమ పిల్లలను చదివిస్తూ స్థానికంగా గుర్తింపు కార్డులు ఓటు హక్కు కలిగి ఉన్నారు. 370 ఆర్టికల్ రద్దు కు ముందు నగరంలోని ఒకటో ఠణ పోలీసులు కొందరు కాశ్మీరులను అదుపులోకి తీసుకున్నారు.

ఇటీవల సిల్క్ సారీ డిజైనింగ్ వర్క్ బ్లౌజ్ చేత పనివారు పెద్ద మొత్తంలో తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాల్లో తిస్తవేశారు వీరి తో పాటు వచ్చే  బెంగాలీల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. వీరు బెంగాలీలా లేక బాంగ్లా నుంచి వచ్చిన బంగ్లాదేశ్, రోహింగ్యాల అనే కోణంలో పోలీసులు అన్వేషణ మొదలుపెట్టారు. నిజామాబాద్ జిల్లాలో నిఘవర్గాలు జల్లెడ పడుతున్నాయి. 

పెహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత రాష్ర్ట పోలీసులు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది నిఘా వర్గాలు జిల్లాల్లో పాకిస్తానీ జాతీయులను గుర్తించే పనిలో పడ్డాయి.  పాకిస్తానీ జాతీయులు తక్షణమే రాష్ర్టం విడిచి వెళ్లి పోవాల్సిందిగా డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఆదేశించిన నేపద్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. గత రెండు రోజులుగా జిల్లాల ఎస్పీలు పోలీసు కమిషనర్లతో డిజిపి సమీక్ష నిర్వహించారు.

పాకిస్తానీలు ఉన్న వెంటనే వారిని పంపించివేయాలని ఆదేశించారు. పోలీసు ఇంటలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగి నిజామాబాద్ జిల్లా లో మొత్తం మూడు కుటుంబాలు ఉన్నట్టు గుర్తించాయి. గతంలో పాకిస్తానీలను పెళ్లి చేసుకొని పాకిస్తాన్లో నివాసం ఉండి భర్తతో విడాకుల అనంతరం నిజామాబాద్ కు చేరుకొని స్థానికంగా నివాసం ఉంటున్న  తల్లి ముగ్గురు పిల్లలను గుర్తించారు. 

పాకిస్తానీ పెళ్లాడి భర్త చనిపోయినట్టు చెప్పబడుతున్న మరో మహిళ నిజామాబాదులోనే నివాసము ఉంటోంది. 

పాకిస్తానీ పెళ్లి చేసుకున్న మరో మహిళ మోసానికి గురై పాకిస్తాన్ నుండి వచ్చి నిజాంబాద్ నగరంలో ఉంటు నట్టు పోలీసులు గుర్తించారు. 

మరొక మహిళ పాకిస్తాన్ ని వ్యక్తిని పెళ్లి చేసుకుని తనకు పిల్లలు కాలేదన్నా సాకుతో నిజామాబాద్ లో నివాసం ఉంటోంది. 

మొత్తం ఐదుగురు స్త్రీలు ముగ్గురు పురుషులుగా పాకిస్తానీలు నమోదయి ఉన్నారు. 

పాకిస్తాన్ దేశస్తులను పెళ్లి చేసుకొని పిల్లలతో తిరిగివచ్చిన వీరు పాకిస్తానీల...?

పాకిస్తాన్లో వీరికి జన్మించిన పిల్లల పౌరసత్వం ఏ దేశానికి చెందినది...? అనే ప్రశ్నకు సమాధానాలు లేదు. 

ఏది ఏమైతే నేమి? మీరంతా పాకిస్తాన్ నుండి వచ్చి జిల్లాలోనే నివాసం ఉంటున్నారు.