calender_icon.png 8 November, 2024 | 4:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్ హత్యకు పాకిస్థానీ కుట్ర

08-08-2024 12:08:23 AM

న్యూయార్క్, ఆగస్టు 7: అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను హత్యచే సేందుకు ఓ పాకిస్థాన్ దేశస్తుడు కుట్రపన్నాడని ఎఫ్‌బీఐ ప్రకటించింది. ట్రంప్‌తోపాటు అమెరికా జాతీయ రాజకీయ నాయకులను అంతమొందించేందుకు అసిఫ్ మర్చంట్ అనే వ్యక్తి భారీ కుట్రకు పాల్పడ్డాడని అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్‌తోపాటు ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే ప్రకటించారు. అమెరికా నేతల హత్యకు అసిఫ్ మర్చంట్‌కు ఇరాన్ సుపారీ ఇచ్చినట్టు తెలిపారు. అసిఫ్ కొంతకాలం ఇరాన్‌లో ఉండి పాకిస్థాన్ మీదుగా అమెరికా చేరినట్టు గుర్తించారు. అమెరికా రాజకీయ నేతల హత్యలే లక్ష్యంగా అసిఫ్ గత జూన్‌లో న్యూయార్క్ చేరుకొన్నాడు. కొందరిని హత్య చేసేందుకు ఇద్దరు కిరాయి హంతకులకు అడ్వాన్స్‌గా 5 వేల డాలర్లు చెల్లించాడు. కానీ, అతడు నియమించుకొన్న కిరాయి హంతకులు నిజానికి అండర్‌కవర్‌లో ఉన్న పోలీస్ అధికారులే. ఆ విషయం అసిఫ్ పసిగట్టలేకపోయాడు. గత నెల అతడు అమెరికాను వదిలి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండగా ఎఫ్‌బీఐ అరెస్టు చేసినట్టు క్రిస్టోఫర్ వ్రే వెల్లడించారు.