calender_icon.png 26 December, 2024 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అఫ్గాన్‌పై పాక్ వైమానిక దాడులు.. 46కు పెరిగిన మృతులు

25-12-2024 04:34:28 PM

కాబూల్: ఆఫ్ఘనిస్తాన్‌లోని తూర్పు సరిహద్దు ప్రావిన్స్‌లో పాకిస్థాన్ వైమానిక దాడుల్లో 46 మంది మరణించారని తాలిబాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రాత్ బుధవారం తెలిపారు. బార్మల్ జిల్లా పక్తికా ప్రావిన్స్ లోని 7 గ్రామాలను లక్ష్యంగా చేసుకుని పాక్ వైమానిక దాడులు చేస్తోందని హమ్దుల్లా ఫిత్రాత్ వెల్లడించారు. పాకిస్థాన్ వైమానిక దాడుల్లో మహిళలు, పిల్లలు మరణించారని తాలిబన్ ప్రభుత్వం పేర్కొంటూ ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. పాక్ దాడుల్లో 46 మంది చనిపోగా మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంది. ఈ దాడుల్లో వజీరిస్థానీ శరణార్థులే ఎక్కువగా చనిపోయినట్లు తెలుస్తోంది. మార్చిలోనూ అఫ్గాన్ పై పాకిస్థాన్ వైమానిక దాడులు చేసింది. తాజాగా మరోసారి సారి దాడులు చేసింది. కాగా, ఈ దాడులపై పాక్ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. 2021లో తాలిబాన్ ప్రభుత్వం అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుండి రెండు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగాయి. పాకిస్తాన్ తన పశ్చిమ సరిహద్దు ప్రాంతాలలో తీవ్రవాద హింసాకాండ జరుగుతోంది.