కేప్‌టౌన్: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ ఫాలో ఆడుతోంది. మొదటి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ కేవలం 194 పరుగులు మాత్రమే చేయడంతో ఫాలో ఆన్ గండం వెంటాడింది. రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న పాక్ జట్టులో ఓపెనర్ షాన్ మసూద్ (102*) ఆకట్టుకున్నాడు. మూడో రోజు ముగిసే సరికి పాక్ 213 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. పాకిస్తాన్ ఇంకా 208 పరుగులు వెనుకబడి ఉంది.