కరాచీ: పాకిస్తాన్‌కు చెందిన ఐదుగురు మాజీ హాకీ ఆటగాళ్లపై జీవితకాల నిషేధం పడింది. పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ (పీహెచ్‌ఎఫ్) కు వ్యతిరేకంగా మరో ఫెడరేషన్ ఏర్పాటుకు ప్రయత్నించినందుకే ఆటగాళ్ల ను బ్యాన్ చేసినట్లు పీహెచ్‌ఎఫ్ అధ్యక్షుడు తారిఖ్ ప్రకటించారు. జీవిత కాలం నిషేధం పడిన వారిలో నాసిర్ అలీ, ఖాలీద్ బషీర్, సలీం నజీమ్, అబ్బాస్ అలీ, హైదర్ అలీ ఉన్నారు.