క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన బంగ్లా
రావల్పిండి: పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య బంగ్లాదేశ్ విజయానికి చేరువైంది. అనూహ్య రీతిలో మొదటి టెస్టు గెలిచిన బంగ్లాదేశ్ రెండో టెస్టులోనూ పట్టు బిగిస్తోంది. 185 పరుగుల టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లా వర్షం అంతరాయం కలిగించడంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. ఇక పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌట్ కావడం గమనార్హం. ఒకానొక దశలో పాక్ కనీసం 150 పరుగుల మార్క్ దాటుతుందా అన్న తరుణంలో అగా సల్మాన్ (47 నాటౌట్) బ్యాట్ ఝలిపించాడు. బంగ్లా బౌలర్లలో హసన్ మహముద్ 5 వికెట్లు.. నహీద్ 4 వికెట్లతో మెరిశారు.