calender_icon.png 25 December, 2024 | 11:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాకిస్థాన్‌దే వన్డే సిరీస్

20-12-2024 10:55:59 PM

కేప్‌టౌన్: సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను పాకిస్థాన్ మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే 2 కైవసం చేసుకుంది. గురువారం అర్థరాత్రి జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ 81 పరుగుల తేడాతో సఫారీలపై విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49.5 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్ బ్యాటర్లు మహ్మద్ రిజ్వాన్ (82 బంతుల్లో 80), బాబర్ ఆజం (95 బంతుల్లో 73) రాణించగా.. కమ్రాన్ గులామ్ (32 బంతుల్లో 63) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 

సౌతాఫ్రికా బౌలర్లలో క్వెనా మఫాకా 4 వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 43.1 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ హెనిరిచ్ క్లాసెన్ (74 బంతుల్లో 97) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ మిగతావారు విఫలమయ్యారు. టోనీ డి జార్జి (34) పర్వాలేదనిపించాడు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది 4, నసీమ్ షా 3 వికెట్లు పడగొట్టారు. మెరుపు అర్థసెంచరీ సాధించిన కమ్రాన్ గులామ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య మూడో వన్డే ఆదివారం జరగనుంది.