calender_icon.png 15 January, 2025 | 11:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాక్ పరువు పాయె

04-09-2024 01:00:35 AM

  1. టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన బంగ్లాదేశ్ 
  2. లార్డ్స్ వేదికగా డబ్ల్యూటీసీ 2023 ఫైనల్

రావల్పిండి:  టెస్టు క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ సంచలనం నమోదు చేసింది. అనిశ్చితి ఆటకు మారుపేరైన పాకిస్థాన్ జట్టును వారి సొంతగడ్డపైనే వైట్‌వాష్ చేసింది. రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టులో 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్  56 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకొని ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. తద్వారా నజ్ముల్ సారధ్యంలోని బంగ్లా జట్టు రెండు టెస్టుల సిరీస్‌ను 2 సొంతం చేసుకుంది. 

రెండో టెస్టు విజయంతో బంగ్లాదేశ్ మొదటి టెస్టు ఏదో గాలివాటంలా గెలిచారని విమర్శలు చేసిన వారి నోళ్లు మూయించింది. ఇన్నేళ్ల తమ టెస్టు చరిత్రలో తొలిసారి పాక్ గడ్డపై టెస్టు సిరీస్ విజయాన్ని నమోదు చేసుకుంది.  సెంచరీతో మెరిసిన లిటన్ దాస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, మెహదీ హసన్ మిరాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. 

నాలుగో స్థానానికి బంగ్లా

పాకిస్తాన్‌పై టెస్టు సిరీస్ విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్  నాలుగో స్థానానికి ఎగబాకగా.. పాక్ 8వ స్థానానికి పడిపోయింది. ఇక టీమిండియా మొదటి స్థానంలో ఉండగా.. ఆసీస్, కివీస్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక ప్రపంచ టెస్టు చాంపి యన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ తేదీని ఐసీసీ మంగళవారం ఖరారు చేసింది. 2023 డబ్ల్యూటీసీ సైకిల్‌లో భాగంగా ఫైనల్ మ్యాచ్‌కు లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్  వేది క కానుంది.  వచ్చే ఏడాది జూన్ 11 మధ్య ఫైనల్ జరగనుంది. ఫైనల్‌కు రిజర్వ్‌డేను కేటాయించినట్లు ఐసీసీ తెలిపింది.