calender_icon.png 11 January, 2025 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీసీబీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో పాక్ దిగ్గజాలు

10-01-2025 11:40:07 PM

నలుగురు మాజీ కెప్టెన్లకు చోటు...

లాహోర్: 2024 ఏడాదికి గానూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో పాక్ మాజీ కెప్టెన్లు ముస్తాక్ మొహమ్మద్, ఇంజమామ్ ఉల్ హక్, మిస్బా ఉల్ హక్, సయీద్ అన్వర్‌లు ఉన్నారు. ముస్తాక్ మొహమ్మద్ 1970వ దశకంలో ఇమ్రాన్, సర్ఫరాజ్, ఆసిఫ్ ఇక్బాల్, జహీర్ అబ్బాస్ లాంటి హేమాహేమీలు ఉన్న జట్టుకు కెప్టెన్‌గా పనిచేశాడు. ఇక ఇంజమామ్ ఉల్ హక్, మిస్బా ఉల్ హక్‌లు 2004 నుంచి 2017 మధ్య కాలంలో నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. సయీద్ అన్వర్ కూడా పలు టెస్టులు, వన్డేల్లో కెప్టెన్‌గా వ్యహరించాడు. మొహమ్మద్ యూసఫ్, యూనిస్ ఖాన్, షోయబ్ మాలిక్ కూడా కెప్టెన్లుగా పనిచేసినప్పటికీ వీరికి హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు మాత్రం దక్కలేదు. కాగా 2021లో తొలిసారి పీసీబీ హాల్ ఆఫ్ ఫేమ్ సంప్రదాయాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు 14 మంది దీనిలో చోటు దక్కించుకున్నారు.