calender_icon.png 30 November, 2024 | 7:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాక్ మొండి పట్టు..

30-11-2024 12:00:00 AM

నేడు మరో సారి భేటీ

దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ- 2025 నిర్వహణ కోసం ఐసీసీ ఆగమేఘాల మీద నిర్వహించిన వర్చవల్ సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. టోర్నీ హైబ్రిడ్ మోడల్‌కు పాక్ ఎంతకీ ఒప్పుకోకపో వడంతో చేసేదేం లేక భేటీని నేటికి వాయిదా వేశారు. నేడు మరోసారి భేటీ అయి పాక్‌ను బుజ్జగించనున్నారు.

పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నఖ్వీ దుబాయ్‌లోనే ఉం డడంతో వ్యక్తిగతంగా హాజరయ్యాడు. బీసీసీఐ సెక్రటరీ జైషా ఆన్‌లైన్లో హాజరయ్యారు. మరి నేటి సమావేశంలైనా ఏదైనా పరి ష్కారం దొరుకుతుందో లేదో చూడాలి.

పంపే ప్రసక్తే లేదు.. 

చాంపియన్స్ ట్రోఫీ కొరకు పాక్‌లో పర్యటించేందుకు భారత జట్టుకు అనుమతి మంజూరు చేసే ప్రసక్తే లేదని విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసిం ది. ఇది వరకే బీసీసీఐ ఇదే విషయా న్ని ఐసీసీకి తెలియజేసింది.