ఇంగ్లండ్‌దే తొలి టెస్టు :
ముల్తాన్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అనిశ్చితి ఆటకు మారుపేరైన పాకిస్థాన్ దానిని మరోసారి రుజువు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 500కు పైగా పరుగులు చేసి కూడా ఓటమిపాలవ్వడం పాక్‌కే చెల్లింది. 152/6 క్రితం రోజు స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన పాకిస్థాన్.. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి 220 పరుగులకే కుప్పకూలింది.
జమాల్ (55*), సల్మాన్ (63) పోరాటంతో పాక్ కనీసం 200 పరుగులైనా చేయగలిగింది. జాక్ లీచ్ 3 వికెట్లు పడగొట్టగా.. అకిన్ సన్, కార్స్ చెరో 2 వికెట్లు తీశారు. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 823 పరుగుల భారీ స్కోరు సాధించింది. రూట్ డబుల్ సెంచరీతో మెరవగా.. బ్రూక్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు.
పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది.ట్రిపుల్ సెంచరీ చేసిన హ్యారీ బ్రూక్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకున్నాడు. గాయం కారణంగా తొలి టెస్టుకు దూరంగా ఉన్న ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్.. వచ్చే మంగళవారం ప్రారంభం కానున్న రెండో టెస్టుకు అందుబాటులోకి రానున్నాడు.