calender_icon.png 8 October, 2024 | 11:52 PM

పటిష్ట స్థితిలో పాక్ ఇంగ్లండ్‌తో తొలి టెస్టు

08-10-2024 12:00:00 AM

ముల్తాన్: ఇంగ్లండ్‌తో మొదలైన తొలి టెస్టును పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ 86 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. సాద్ షకీల్ (35*)తో పాటు నైట్ వాచ్‌మన్ నసీమ్ షా క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న పాక్‌కు ఆదిలోనే షాక్ తగిలినప్పటికీ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (102)తో పాటు కెప్టెన్ షాన్ మసూ ద్ (151) సెంచరీలు బాదారు.

స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరు ఔట్ కావడంతో స్కోరు మందగించింది. ఈ దశలో బాబర్ ఆజం (30) టచ్‌లో కనిపించినప్పటికీ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఇంగ్లం డ్ బౌలర్లలో అకిన్‌సన్ 2 వికెట్లు తీయగా.. వోక్స్, జాక్ లీచ్ చెరొక వికెట్ పడగొట్టారు.