calender_icon.png 27 November, 2024 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అట్టుడుకుతున్న పాకిస్థాన్

27-11-2024 02:49:43 AM

ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేయాలని నిరసనకారుల డిమాండ్

ఆందోళనల్లో ఐదుగురు మృతి

ఇస్లామాబాద్, నవంబర్ 26: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులకు, భద్రతాదళాలకు మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడంతో ఒక నిరసనకారుడు సహా నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. తనపై వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా బానిస సంకెళ్ల నుంచి విముక్తి కోసం దేశ వ్యాప్తంగా నిరసనలు తెలపాలని ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి ఆదివారం పిలుపునిచ్చారు.

ఈ క్రమంలో పాక్ మాజీ ప్రధాని, తెహ్రీక్ అధినేత ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్‌తో ఆ పార్టీ మద్దతుదారులు రోడ్డెక్కారు. నిరసనకారులు దేశ రాజధానివైపు కదిలి సోమవారం ఇస్లామాబాద్‌లోకి ప్రవేశించారు. మంగళవారం కూడా ఆందోళనలు కొనసాగాయి. కాగా, నిరసనకారులను అడ్డుకునేందుకు రాజధానిలో సైన్యం మోహరించింది. షూట్ ఎట్ సైట్ ఆదేశాలను అధికారులు జారీ చేశారు. ఈ ఆందోళనలకు ఇమ్రాన్ భార్య బుష్రా బీబీతోపాటు ఖైబర్ పఖ్తుఖ్వ సీఎం అలీ అమీన్ గడ్డాపూర్ నేతృత్వం వహిస్త్నురు.