భారత్ ఆశలు గల్లంతు
దుబాయ్: మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఓటమితో భారత్ సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. టీమిండియా సెమీ స్ చేరాలంటే న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. కానీ ఆ జట్టు ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించడంతో పాటు హర్మన్ సేనను బయటికి తీసుకొచ్చిం ది.
సోమవారం కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 54 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. ఓపెనర్ సుజీ బేట్స్ (28) టాప్ స్కోరర్. పాక్ బౌలర్లలో నష్రా సందూ 3 వికెట్లు పడగొట్టింది.
అనంతరం బరిలోకి దిగిన పాక్ 11.4 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌటైంది. మునీబా (15) మాత్రమే డబుల్ డిజిట్ మార్క్ అందుకుంది. కివీస్ బౌలర్లలో అమేలీ కెర్ 3 వికెట్లు తీయగా.. రోస్‌మేరీ, కార్సన్, లియా, జోనస్ తలా ఒక వికెట్ తీశారు.