బులవాయో: జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను పాకిస్థాన్ 2 సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మూడో వన్డేలో పాక్ జట్టు 99 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. కమ్రాన్ గులామ్ (103) శతకంతో మెరవగా.. అబ్దుల్లా షఫీక్ (50) రాణించాడు. అనంతరం జింబాబ్వే 40.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటై పరాజయం చవిచూసింది. కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ (51) మినహా మిగతావారు విఫలమయ్యారు. సయీమ్ అయూబ్, అబ్రర్, హారిస్ రవూఫ్, ఆమెర్ జమల్ తలా 2 వికెట్లు పడగొట్టారు.