ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీపై నిషేధం విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాక్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ సోమవారం ప్రకటించారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని పీటీఐ పార్టీపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. విదేశీ ఫండ్స్ కేసు, మే 9న జరిగిన అల్లర్లు, చిపర్ ఎపిసోడ్ వంటి కేసులతో పాటు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పీటీఐ పార్టీ సంబంధించి తగ్గిన ఆధారాలు లభిస్తే ఇమ్రాన్ ఖాన్ పార్టీని నిషేధించడం కాయామని అత్తావుల్లా తెలిపారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ అనేక కేసుల్లో పాకిస్థాన్ జైల్లో ఉన్నారు.