11-03-2025 11:29:08 PM
అమెరికా రాకుండా అహ్సాన్ వాగన్‌పై వేటు...
న్యూయార్క్: పాకిస్థాన్ రాయబారి అహ్సాన్ వాగన్ అమెరికాలో అడుగుపెట్టకుండా బహిష్కరణకు గురయ్యారు. వీసాతో పాటు చట్టపరమైన ప్రయాణ పత్రాలు అన్నీ ఉన్నప్పటికీ యూఎస్‌లోని లాస్ ఏంజెల్స్‌కు రావొద్దంటూ ట్రంప్ ప్రభుత్వం అతడిపై వేటు వేసింది. ప్రస్తుతం అహ్సాన్ వాగన్ తుర్క్‌మెనిస్థాన్‌లో పాకిస్థాన్ రాయబారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల విధానంపై కఠిన చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వీసా విషయంలో వివాదాస్పద కారణాలు ఉండడంతో అహ్సాన్‌కు చుక్కెదురైనట్లు తెలుస్తోంది. సెలవుపై ఉన్న అహ్సాన్ లాస్ ఏంజెల్స్ వెళ్లాలనుకున్నారు.
వీసా సంబంధింత పత్రాలు సరిగ్గా లేవన్న కారణంతో అమెరికాకు చెందిన ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానాశ్రయంలోనే ఆయన్ను అడ్డుకున్నారు. దీనికి సంబంధించి సరైన కారణాలను మాత్రం అమెరికా వెల్లడించలేదు. కాగా అహ్సాన్‌పై బహిష్కరణ వేయడంపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి ఇషాక్ దార్ స్పందించారు. వలసలపై అమెరికాకు అభ్యంతరం ఉండడం వల్లే అహ్సాన్ వేటుకు గురయ్యారని తెలిపారు. కాగా అహ్సాన్ వేటుకు గల కారణాలను పరిశోధించాలంటూ లాస్ ఏంజెలెస్‌లోని పాకిస్థాన్ కాన్సులేట్ కార్యాలయానికి పాక్ విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ప్రస్తుత పరిస్థితిని వివరించేందుకు వాగన్ ఇస్లామాబాద్‌కు రావాలని పేర్కొంది. కాగా వాగన్‌కు దౌత్యవేత్తగా మంచి అనుభవముంది. గతంలో లాస్ ఏంజెల్స్‌లోని పాకిస్థాన్ కాన్సులేట్‌లో డిప్యూటీ కాన్సులేట్ జనరల్‌గా పనిచేయడం గమనార్హం.