calender_icon.png 5 November, 2024 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాక్‌ను కంగారెత్తించారు

05-11-2024 12:03:49 AM

తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం

మెల్‌బోర్న్: సొంతగడ్డపై పాకిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఆస్ట్రేలియా బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో పాకిస్థాన్ 46.4 ఓవర్లలో 203 పరుగులకే చాపచుట్టేసింది. పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్ (44), బాబర్ ఆజం (37) పర్వాలేదనిపించారు.  ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 3 వికెట్లు తీయగా.. కమిన్స్, జంపా చెరో 2 వికెట్లు పడగొట్టారు. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూలకు విజయం అంత సులువుగా దక్కలేదు. టార్గెట్‌ను ఛేదించే క్రమంలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ (49), సీనియర్ బ్యాటర్ స్మిత్ (44) రాణించగా.. ఆఖర్లో కెప్టెన్ కమిన్స్ (32*) విజయంలో కీలకపాత్ర పోషించాడు. మూడు వికెట్లతో పాక్ నడ్డి విరిచిన మిచెల్ స్టార్క్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే శుక్రవారం జరగనుంది.