calender_icon.png 2 November, 2024 | 9:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చినాబ్ బ్రిడ్జ్‌పై పాక్ కన్ను

02-11-2024 12:35:50 AM

వంతెన సమాచారం కోరిన మిత్రదేశం చైనా!

శ్రీనగర్, నవంబర్ 1: జమ్ముకశ్మీర్‌లోని చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్య ంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్‌పై పాక్ కన్నేసినట్లు నిఘావర్గాలు పేర్కొన్నాయని జాతీయ మీడి యా పేర్కొంది. రైసీ, రామబాణ్ జిల్లాల్లోని ఈ బ్రిడ్జ్ కశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాం తాలను కలుపుతుంది. నదీగర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున ఉన్న ఈ రైల్వే వంతెన పొడవు 1,315 మీటర్లు. తమ మిత్రదేశమైన చైనా పాకిస్థాన్‌ను కోరడంతో ఆ దేశ నిఘా వర్గాలు బ్రిడ్జి గురించి కీలక విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే బ్రిడ్జ్ గురించి ఏ సమాచారం  తెలుసుకుంటున్నారనే విషయమై స్పష్టత లేదు. కాగా ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి మనదేశానికి 20 ఏండ్లు పట్టింది. తాజాగా ఈ వంతెనపై తొలి రైలు ట్రయల్ రన్‌ను సక్సెస్‌ఫుల్‌గా చేపట్టారు.