calender_icon.png 27 April, 2025 | 2:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాక్ ప్రతిచర్యలు

25-04-2025 12:53:35 AM

  1. భారత్ నిర్ణయాలపై దాయాది దేశం మండిపాటు
  2. ప్రధాని షెహబాజ్ నేతృత్వంలో కీలక నిర్ణయాలు
  3. వాఘా సరిహద్దు మూసివేత..భారతీయులకు వీసాల రద్దు
  4. భారత విమానాలకు గగనతలం నిరాకరణ

ఇస్లామాబాద్, ఏప్రిల్ 24: జమ్మూకశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకి స్థాన్‌పై భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలపై దాయాది దేశం సైతం ప్రతీకార చర్యలకు దిగిం ది. వాఘా సరిహద్దును మూసివేయడం, భార త జాతీయులకు వీసాలు రద్దుచేయడం, భార త విమానాలు, విమానసంస్థలు పాక్ గగన తలం గుండా ప్రయాణించ కుండా ఎయిర్‌స్పే స్‌ను మూ సివేయడం, సిమ్లా ఒప్పం దాన్ని నిలి పివేయడం వంటి కీలక నిర్ణయాలు తీసుకుంది.

గురువారం పాకిస్థాన్ ప్రధాన మంత్రి షరీఫ్ అధ్యక్షతన జరి గిన జాతీయ భ ద్రతా కమిటీ సమావేశం తర్వాత నిర్ణయా లు ప్రకటిం చింది.  పాక్‌పై భారత్ తీసుకున్న చర్యలు ఏకపక్షమని, అన్యాయమని, రాజకీయ ప్రేరేపి తమని, చట్టపరంగా అర్హత లేనివిగా   భారత్ నిర్ణయాల నేపథ్యంలో ఎలా ముందు కు వెళ్లాలి.. సరిహద్దులో తాజా పరిస్థితి, భారత్ తో యుద్ధం వస్తే ఎలా ఎదుర్కొవాలి అనే అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. సైన్యానికి సెలవులు  రద్దు చేసింది.

ప్రతీకార చర్యలు ఇవే

* వాఘా సరిహద్దు తక్షణమే మూసివేత. ఈ మార్గం ద్వారా భారత్ నుంచి అన్నిరకాల రవాణా నిలిపివేయబడుతుంది.

* సిమ్లా ఒప్పందం-1972 సహ అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు నిలిపివేత.

* సార్క్ వీసా మినహాయింపు పథకం కింద భారతీయులకు జారీ చేయబడిన అన్ని రకాలు వీసాలు తక్షణమే రద్దు. ఈ పథకం కింద ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న భారతీ యులు 48గంటల్లోపు పాక్ విడిచివెళ్లాలి.

* పాకిస్థాన్ గగనతలంలో భారత్‌కు చెందిన విమానాలు గానీ, భారతీయ సంస్థలు నడుపుతున్న విమానాలు గానీ ప్రయాణిం చకుండా ఎయిర్‌స్పేస్ మూసివేత.

* భారత్‌తో వాణిజ్యాలు నిలిపివేత.

* ఇస్లామాబాద్‌లోని భారత రక్షణ, నావికా దళం, వైమానిక సలహాదారులు ఈనెల 30లోపు దేశం విడిచివెళ్లాలి. హైకమిషన్‌లో వారి పదవులు రద్దు చేయబడ్డాయి.

* ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ సిబ్బంది సంఖ్య 30కి తగ్గుతుంది.

సింధూజలాల ఒప్పందం నిలిపివేతపై ఖండన

 సింధూ జలాల ఒప్పందం-1960 అమలు ను భారత్ నిలిపివేయడంపై పాక్ తీవ్రంగా ఖండించింది. ఇది 24కోట్ల పాకిస్థాన్ ప్రజలకు సంబంధించిన అంశమని పేర్కొంది. ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ ఒప్పందంలో పాల్గొన్నాయని, భారత్ ఏకప క్షంగా ఈ ఒప్పందం నుంచి వైదొలగలేదని, చట్టబద్ధంగా పోరాడుతామని తెలిపింది. సిం ధూ జలాలను ఆపడం అంటే యుద్ధం ప్రక టించడమేనని పాక్ విద్యుత్ శాఖ మంత్రి అవాయిస్ లెఘారీ సంచలన వ్యాఖ్యలు చేశారు.