calender_icon.png 1 November, 2024 | 1:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌తో మ్యాచ్.. పాక్ మైండ్ బ్లాక్

16-05-2024 01:30:05 AM

న్యూఢిల్లీ: ఐసీసీ టోర్నీల్లో టీమిండియాపై గెలవడం పాకిస్థాన్‌కు శక్తికి మించిన పనంటూ మాజీ క్రికెటర్ మిస్బా ఉల్ హక్ అభిప్రాయపడ్డాడు. భారత్‌తో మ్యాచ్ అంటే పాక్ ఆటగాళ్లకు మైండ్ బ్లాక్ అవుతుందని వ్యాఖ్యానించాడు. ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో జూన్ 9న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తలపడుతున్న నేపథ్యంలో మిస్బా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ప్రపంచకప్‌ల్లో భారత్‌తో తలపడేటప్పుడు పాక్ జట్టుపై ఒత్తిడి పెరిగిపోతుంది. రానున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడించడం పాక్‌కు శక్తికి మించిన పనే. పటిష్టమైన భారత బౌలింగ్ లైనప్‌ను ఎదుర్కోవాలంటే పాక్ జట్టు చాలా కష్టపడాల్సి ఉంటుంది. బుమ్రా, సిరాజ్, హార్దిక్ రూపంలో భారత్‌కు నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. పటిష్టమైన ఆస్ట్రేలియాను ఓడించే సత్తా ఉన్నా.. మాకు భారత్‌తో మ్యాచ్ అంటేనే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇక విరాట్ కోహ్ల్లీ రూపంలో పాక్ జట్టుకు ముప్పు పొంచి ఉంది. మాపై మంచి రికార్డు ఉన్న కోహ్లీ మరోసారి చెలరేగే అవకాశముంది. స్ట్రయిక్‌రేట్‌తో పని లేకుండా అతడు మ్యాచ్‌ను గెలిపించగలడు. గొప్ప ఆటగాళ్లు ఎప్పుడు విమర్శలను పట్టించుకోరు.  2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌ను మరిచిపోలేను. భారత్, పాక్ ఫైనల్ క్రికెట్ చరిత్రలో గొప్ప మ్యాచ్‌గా మిగిలిపోతుంది. ఆ ప్రపంచకప్‌లో ఏ జట్టు సీరియస్‌గా లేదు. కానీ భారత్ మాత్రం ధోనీకి కెప్టెన్సీ అప్పగించి ఫలితం రాబట్టింది. 2007 ప్రపంచకప్ తర్వాత టీ20 క్రికెట్‌కు విపరీతమైన ఆదరణ పెరిగింది’ అని మిస్బా పేర్కొన్నాడు.