రావల్పిండి: సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ బ్యాటర్లలో సయీమ్ అయూబ్ (58) టాప్ స్కోరర్ కాగా.. షాన్ మసూద్ (57) రాణించాడు. మిడిలార్డర్‌లో బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ తలా కొన్ని పరుగులు చేయగా.. లోయర్ ఆర్డర్‌లో అగా సల్మాన్ అర్థసెంచరీతో రాణించడంతో పాకిస్థాన్ 250 పరుగుల మార్క్‌ను అధిగమించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ ఐదు వికెట్లతో చెలరేగగా.. తస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాదేశ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది.